English | Telugu

నిఖిల్ నిజస్వరూపం బయటపడింది. గోతికాడ నక్క!

బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ మరోసారి షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం జరిగే టాస్క్ లలో రెండు క్లాన్స్ మధ్య చిచ్చు రేగింది.

నిన్న హౌస్ లో రెండు టాస్క్ లు జరుగగా అందులో ఒకటి సీత టీమ్ గెలవగా.. మరొకటి ఎవరు గెలవలేదు. ఇక నేడు తాజాగా రీలీజ్ చేసిన ప్రోమోలో శక్తి క్లాన్ గెలిచినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పుకోమని చెప్పాలి మ కానీ కంటెస్టెంట్ ని తీసేసే పవర్ శక్తి క్లాన్ కి ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో కాంతారా టీమ్ నుండి నబీల్ ని తీసేశాడు నిఖిల్ . దాంతో కిర్రాక్ సీత, ప్రేరణ ఇద్దరు ఫుల్ ఫైర్ అయ్యారు. అలా ఎలా తీస్తారు. మన టీమ్ లో నబీల్ బాగా ఆడుతున్నాడు. అతడిని తీసేస్తే వాళ్ళే అన్ని టాస్క్ లు గెలుస్తారని కాంతారా టీమ్ భయపడుతుంది.

ఇక మణికంఠ విషయంలో నిఖిల్, సోనియా, పృథ్వీ ఇచ్చిన ప్రెషర్ తో అతన్నే తప్పుకునేలా చేశారంటు ప్రేరణ, సీత అడుగగా.‌. ఎస్ అంటు మణికంఠ సమాధానమిచ్చాడు. దాంతో సోనియా అతడిపై ఫైర్ అయింది. ఇలా మోసం చేస్తావనుకోలేదంటు మణికంఠని ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతుంది సోనియా. ఇక సోనియాతో పాటు నిఖిల్ , పృథ్వీ కూడా మణికంఠదే తప్పు అన్నట్టుగా మాట్లాడేసరికి అతను మైక్ విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.