English | Telugu
Wildfire Nominations : రీతూ చౌదరి తప్ప అందరూ నామినేషన్‌లోనే!
Updated : Nov 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్ రెండు దశల్లో జరిగింది. మొదటి దశ ప్రైవేట్ నామినేషన్ జరిగింది. ఇందులో డీమాన్ పవన్ ని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేయగా సుమన్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. తనూజని భరణి నామినేట్ చేశాడు. వాళ్లకు ఏదైనా గోడవ ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోండి. ప్రతీదాంట్లో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు.. ఇద్దరు మెచూర్ గా ఆలోచించడం లేదని తనూజని నామినేట్ చేశాడు.
కళ్యాణ్ ని డీమాన్ నామినేట్ చేశాడు.. భరణిని దివ్య నామినేట్ చేసింది. సంజనని సుమన్ నామినేట్ చేయగా.. డీమాన్ ని తనూజ నామినేట్ చేసింది. సంజన, భరణి ని నామినేట్ చేసింది. అందరు తమ రీజన్స్ చెప్పి నామినేట్ చేసి మొదటి లెవెల్ నామినేషన్ ప్రక్రియని పూర్తిచేస్తారు.
ఇక రెండో లెవెల్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ అందరు ఎవరిని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి వారి ఫోటోని మంటలో వెయ్యాలి. దివ్యని భరణి నామినేట్ చేశాడు. తనూజని సంజన నామినేట్ చేసింది. డీమాన్ ని కళ్యాణ్ చేయగా తనూజని సుమన్ నామినేషన్ చేశాడు. తనూజని దివ్య నామినేట్ చేసింది. ఇమ్మాన్యుయల్ ని డీమాన్ నామినేట్ చేశాడు. దివ్యని తనూజ నామినేట్ చేసింది. కళ్యాణ్ ని రీతూ నామినేట్ చేసింది. సంజనని రెండో నామినేషన్ గా రీతూ చేసింది. అలా కంటెస్టెంట్స్ అందరు రెండో లెవెల్ ని పూర్తి చేశారు. ఒక్క రీతూ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు.