English | Telugu
ఏంటి శ్రీరామ్ పొటాటో కట్ చేయడానికి అంత కుస్తీ పడుతున్నావ్
Updated : Nov 9, 2022
"ఆహా"లో మంచి లక్ష్మి హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ చెఫ్ మంత్ర సీజన్ 2 . ఈ క్రమంలోనే ఎపిసోడ్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా ఫేమస్ సింగర్ శ్రీరామ్ చంద్ర, నటి రాశిసింగ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ‘పాపం పసివాడు’ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇది త్వరలో ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్రాకు వచ్చిన వీరిద్దరితో మంచు లక్ష్మీ తనదైన శైలిలో అల్లరిచేసింది, చేయించింది. వారితో రకరకాల వంటకాలను చేయించింది. "శ్రీరామచంద్రని పిలిస్తే ఆయన డూప్ ని తీసుకొచ్చారేమిటి" అని సెటైర్ వేసింది మంచు లక్ష్మి. "శ్రీరామ్... రాశిసింగ్ ఫుట్ వేర్ సైజు ఏమిటి అని అడిగేసరికి సిగ్గుపడ్డాడు. దాంతో ఇద్దరి మధ్యన ఏదో జరుగుతోంది" అని చెప్పింది లక్ష్మి.
"ఏంటి శ్రీరామ్ పొటాటో కట్ చేయడానికి అంత కుస్తీ పడుతున్నావ్" అంది. ఇక శ్రీరామ్ చపాతీని హార్ట్ షేప్ లో చేసి తెలియకుండా హార్ట్ షేప్ వచ్చేసిందని చెప్పేసరికి "అందుకేనా ఇంకా సింగల్ గా వున్నావ్ " అని కౌంటర్ వేసింది హోస్ట్. ఇక శ్రీరామచంద్ర ఫైనల్ గా ఒక సాంగ్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ నవంబర్ 11 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది.