English | Telugu
రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరు?
Updated : Nov 17, 2022
రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ని ని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కొత్త ప్రోమో విడుదల చేశారు. "బావగారు బాగున్నారా" అనే కాన్సెప్ట్‌తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ ఎపిసోడ్‌కి బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ చాలా రొమాంటిక్‌గా ఉంది.
ఐతే ఇందులో ఫైనల్‌గా మరో కాన్సెప్ట్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ఇంటరెస్టింగ్ థంబ్ నెయిల్స్ కొన్నిటిని తీసుకుని ప్లే చేసి వాటికి ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ థంబ్ నెయిల్ ఆది పోస్టర్‌తొ పెట్టింది. అది.. "ఆది జబర్దస్త్‌లో ఒక స్కిట్‌కి ఎన్ని లక్షలు తీసుకుంటాడో మీకు తెలుసా?". ఇక రష్మీ పోస్టర్‌తో ప్లే చేసిన సెకండ్ థంబ్ నెయిల్"రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చారంట..ఎవరా హీరో?". దీనికి ఇంద్రజ "ఎవరా హీరో?" అనేసరికి రష్మీ ఆన్సర్ చేయలేక తుళ్ళిపడింది.
ఇక నాటి నరేష్ పోస్టర్‌తో ప్లే చేసిన మూడవ థంబ్ నెయిల్ "నాటీ నరేష్ లోపం గురించి డాక్టర్ ఏమన్నారో తెలుసా?". ఇలా థంబ్ నెయిల్స్‌కి వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు కానీ వాటిని ఈ ప్రోమోలో మ్యూట్ చేశారు. కాబట్టి ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.