English | Telugu
అర్ధరాత్రి ఆమె గుర్తుకొచ్చింది.. క్రీం బిస్కెట్ వేసిన జెస్సీ!
Updated : Nov 17, 2022
మోడల్ జెస్సీ కాస్తా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు హీరో కూడా ఐపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక జెస్సీకి మంచి ఆఫర్స్ రావడం మొదలయ్యింది. 'ఎక్స్‌పోజ్డ్' వెబ్ సిరీస్‌లోలో ఒక కీలక రోల్‌లో నటించాడు. ఇక ఇటీవల జెస్సీ నటించిన 'ఎర్రర్ 500' మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది.
ఇక మూవీ ప్రమోషన్స్ పనిలో మునిగి తేలుతున్నాడు జెస్సీ. లేటెస్ట్‌గా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి గెస్ట్‌గా వచ్చిన జెస్సీ సీరియల్ నటితో కలిసి స్టెప్పులేశాడు. "బావగారు బాగున్నారా" టైటిల్‌తో ఈ వారం బావామరదళ్ళు అంతా కలిసి ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. జెస్సీ ఈ ఎపిసోడ్‌లో అమ్మాయిలను బాగా పటాయించాడు. తాను డాన్స్ చేసిన అమ్మాయి కోసమే ఈ షోకి వచ్చినట్లు చెప్పాడు. రెండ్రోజులు తనతో చేసిన కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసేసరికిఆమె మాయలో పడిపోయినట్లు జెస్సీ చెప్పుకొచ్చాడు.
అంతేనా!అర్ధరాత్రి 12 గంటలకు ఆమె గుర్తొచ్చి ఏం చేయాలో తెలియకపోయేసరికిఆమె ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆమె ఫొటోలే చూస్తూ ఉండిపోయానంటూ క్రీం బిస్కెట్ వేసాడు. ఇక జెస్సీ మాటలకు ఫ్లాట్ ఐపోయిన ఆ నటి అతడిని గట్టిగా హగ్ చేసేసుకుంది. ఈ మధ్య గ్యాప్‌లో జడ్జి ఇంద్రజ చేత్తో హార్ట్ సింబల్ వేసి రొమాంటిక్ సాంగ్ హమ్ చేసింది. ఇక స్క్రీన్ మీద హార్ట్ సింబల్స్, లవ్ సాంగ్స్ ప్లే అయ్యాయి. ఇదంతా నిజంగా ప్రేమేనా.. లేదంటే షో కోసం చేశారా అనే విషయం తెలియాలంటే సండే వరకు వెయిట్ చేయాలి.