English | Telugu
డిసెంబర్ 31 న ఈటీవీలో ‘వేర్ ఈజ్ ది పార్టీ’...
Updated : Dec 21, 2022
మరి కొద్ది రోజుల్లో డిసెంబర్ నెల వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రాబోతోంది. ఇక ఈ సందడిని క్యాష్ చేసుకోవడం కోసం బుల్లితెర రెడీ ఐపోయింది. టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్ తో కొత్త కొత్త ఈవెంట్ ప్రోమోస్ ని రిలీజ్ చేసేస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఈ షోస్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ ఆరాటపడిపోతున్నారు. అలాంటి దానిలో ఇప్పుడు ఈటీవీలో రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. " క్యాష్.. వేర్ ఈజ్ ది పార్టీ" పేరుతో ఈ కొత్త ఈవెంట్ డిసెంబర్ 31 న రాత్రి 9 .30 లకు ప్రసారం కాబోతోంది.
ఈ ప్రోగ్రాంకి హోస్ట్ గా సుమ వ్యవహరిస్తోంది. ఇందులో బుల్లితెర నటులు అందరూ కనిపించారు. ఆది, రాంప్రసాద్, శ్రీవాణి, యాదమ్మ రాజు, యాట నవీన, కావ్య, అమ్మ రాజశేఖర్, సోహైల్ వంటి ఎంతోమంది ఈ ఈవెంట్ లో కనిపించి ఎంటర్టైన్ చేయబోతున్నారు. హోస్ట్ ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరి కళ్ళకు గంతలు కట్టుకుని మ్యూజికల్ చైర్స్ ఆడించారు. మంగ్లీ తన హస్కీ వాయిస్ తో సాంగ్స్ పాడి అలరించింది. ఇలా ఎన్నో రకాల కాన్సెప్ట్స్ అనేవి ఈ ఈవెంట్ లో కనిపించబోతున్నాయి. ఫైనల్ గా సుమకి అందరూ కలిసి షాల్ కప్పి ఆమెను సత్కరించారు.