English | Telugu

బిగ్ బాస్ జెస్సితో కలిసి ఫాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన తల్లీకూతుళ్లు

సురేఖ వాణి అంటే సోషల్ మీడియాలో తెలియని వారు లేరు. ఆమె తెలుసు అంటే ఆమె కూతురు సుప్రీతా కూడా ఇంకా బాగా తెలుసు. ఈ తల్లీకూతుళ్లు చేసే రీల్స్ అంత ఫేమస్ మరి.

ఇక ఇద్దరూ పోటా పోటీగా హాట్ పోజులు కూడా ఇస్తుంటారు. ఐతే వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించి వాళ్ళ ఫాన్స్ లో ఆనందం నింపారు. సురేఖా వాణి-సుప్రీత కలిసున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీస్ లో చక్కగా చీర కట్టుకుని బొట్టు, పూలు పెట్టుకుని కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం టోటల్ డిఫరెంట్.. పెళ్లీడుకొచ్చిన కూతురు సుప్రీతతో కలిసి పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది దాంతో నెటిజన్స్ కూడా బ్యూటీస్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

అకేషన్ ఏదో తెలీదు కానీ సొట్ట బుగ్గల సిన్నోడు జెస్సితో కలిసి తల్లీ కూతుళ్లిద్దరూ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.