English | Telugu

మా మధ్య గ్యాప్ కి కారణం వాళ్ళే..అందుకే పవన్ పెళ్ళికి రాలేదు!

పవన్ కళ్యాణ్, అలీ జంటను మూవీస్ లో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి మూవీలో ఆలీకి కచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది. ఐతే రాజకీయంగా కొంతకాలం నుంచి పవన్ కి ఆలీకి మధ్యన కాస్త గ్యాప్ వచ్చింది. రాజకీయ కారణాలతో వీళ్ళు విడిపోయారనే ప్రచారం బయట బాగా జరుగుతుండేసరికి ఆలీ దానికి సరైన సమాధానం ఇచ్చారు. యాంకర్ సుమ ప్రశ్నకు సమాధానంగా… పవన్ కళ్యాణ్ తో నాకు ఎలాంటి గ్యాప్ రాలేదు. కొంతమంది కావాలనే గ్యాప్ క్రియేట్ చేశారు.

మీడియాలో ఏవేవో కథనాలు ప్రచారం చేశారు. అవే నిజం అనుకుని జనాలు నమ్మేశారు. నా కూతురు వివాహానికి పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేయడానికి ఆయన నటిస్తున్న మూవీ సినిమా సెట్స్ కి వెళ్ళాను. అదే టైములో వేరే వాళ్ళు కూడా ఆయన్ని కలవడానికి వచ్చారు. వాళ్ళను వెయిట్ చేయమని చెప్పి పవన్ నన్ను కలిశారు. దాదాపు 15 నిమిషాలు మేము సరదాగా మాట్లాడుకున్నాము. మా అమ్మాయి పెళ్ళికి ఆయన రావాల్సి ఉంది. ఐతే లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు. మా అమ్మాయి పెళ్లికి పవన్ రాకపోవడానికి కారణం అదే. అంతకు మించి మా మధ్య ఎలాంటి గ్యాప్ అనేది లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.