English | Telugu
బిగ్ బాస్ నామినేషన్స్‌కి వెళ్లిందెవరు.. తప్పించుకుందెవరు?
Updated : Sep 7, 2022
బిగ్ బాస్ రెండవ రోజు.. రజనీకాంత్ నటించిన ‘పెట్టా’ మూవీలోని 'మరణం... మాసు మరణం' అనే పాటతో మొదలైంది. ఉదయం 8:15 గంటలకు అర్జున్, కీర్తి భట్ మధ్య గుసగుసలు. ఉదయం 9 గంటలకుభార్యాభర్తలమధ్య చిలిపి మాటలు "హగ్ ఇలా ఇచ్చాడు" అని నవ్వుతూ చెప్పుకొచ్చింది మెరీనా.
ఉదయం 11:45 గంటలకు "ఎవరు క్లాస్‌లో ఉండాలో, క్లాస్ నుండి ఎవరు ట్రాష్లోకి వెళతారో మీరే నిర్ణయించుకోండి. క్లాస్ సభ్యులు, ట్రాష్ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళి చర్చించుకోండి" అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత గలాటా గీతూ గట్టి టాస్క్ ఇస్తే తను ఓడిపోతానని చెప్పింది. టాస్క్ ఏంటో కూడా తెలియకుండా అలా ఎలా ఓడిపోతానని చెప్పగలవని చలాకీ చంటి అన్నాడు. అలాగే రేవంత్ ఓపిక లేదని, టాస్క్ ఇచ్చినా ఓడిపోతానని అన్నాడు. "నామినేషన్స్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నాకు నవ్వొస్తుంది" అని గీతూ అంది.
"ట్రాష్ నుండి క్లాస్ కి ఎవరు వెళ్తారు?" అని బిగ్ బాస్ అడిగితే,"గీతూని పంపిస్తున్నా" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్‌తోరేవంత్, "పొద్దున్నుంచి ఏం తినలేదు భయ్యా.. ఓపిక లేదు" అని ఏడ్చేసాడు. అర్జున్ "ఊరుకోండి బ్రో.. మీరు స్ట్రాంగ్" అని చెప్పి ఓదార్చాడు.
ఆ తర్వాత క్లాస్లోకి వెళ్ళిన గలాటా గీతూ తన ఆధిపత్యం చలాయించింది. ఆరోహీతో గీతూ "ఆరోహి.. నీళ్ళు తీసుకొస్తే చేయి కడుక్కుంటా. టిష్యూ ఎవడు తెస్తాడు"" అనగానే ఆరోహీ నవ్వుతూ "దీంతో తుడుచుకో" అని టీ షర్ట్ ఇవ్వబోయింది. ఆ తర్వాత ఇనయ మీద గట్టిగా పగతీర్చుకోడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఇనయతో గీతూ,"నిమ్మకాయ నీళ్ళు తీసుకురా చక్కెర వేసుకొని" అని చెప్పింది. తీసుకొచ్చాక "ఓ పాట పాడు రాజా" అంది. అప్పుడు ఇనయ "నాకు పాటలు పాడటం రావు. ఇంట్లో పనులు ఏవైనా చెప్పు చేస్తాను. నీ కోసం రైమ్ ఎందుకు పాడుతా. బిగ్ బాస్ రూల్స్లో పాటలు పాడాలని లేదు" అని చెప్పేసింది. తర్వాత "అర్జున్ నువ్వు పాట పాడు. ఆరోహీ నువ్వు గిటార్ ప్లే చేయి" అని ఆర్డర్ వేసింది గీతూ.
ఆదిరెడ్డికి, ఇనయ సుల్తానాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆదితో"కళ్ళు పెద్దవి చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నావ్" అంది సుల్తానా. ఆది "నా మాటే అంత. లీవ్ ఇట్ " అన్నాడు.
అభినయశ్రీ , రేవంత్ సెకండ్ టాస్క్ లో పాల్గొన్నారు. సంచాలకురాలిగా గలాటా గీతూను ఎన్నుకున్నారు. టాస్క్‌లో గెలిచి ట్రాష్ నుండి మాస్ లోకి వెళ్ళాడు రేవంత్. "మాస్ నుండి ట్రాష్ లోకి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ అడిగాడు. డైస్ టాస్క్ తర్వాత నేహా మాస్ నుండి క్లాస్లోకి వెళ్ళింది.
సూర్య తను క్లాస్ నుండి మాస్‌కి వెళ్ళాలనుకుంటున్నట్లు ఆదిత్యతో చెప్పుకున్నాడు. బెడ్ రూంలో మెరీనా తన భర్తకు ఒక విషయం గురించి చెబుతూంటే అతను తను చెప్పేది వినట్లేదని అలిగి బయటకు వెళ్ళిపోయింది.
నేహా, ఆదిరెడ్డి , గీతు ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకుంటున్నారు. అభినయశ్రీ, ఇనయ సుల్తానా, ఆదిత్య నేరుగా నామినేషన్స్ కు వెళ్తారని బిగ్ బాస్ చెప్పాడు. మొత్తానికి రెండవ రోజు నామినేషన్స్‌కు ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు తప్పించుకున్నారు.