కాజల్ పారితోషికం ఎంతో తెలుసా?
on Dec 12, 2021

బిగ్‌బాస్ ఫైనల్ అంకానికి చేరింది. ఈ షో ముగియడానికి మరో వారమే మిగిలి వుంది. దీంతో చివరి వారం అంటే ఈ ఆదివారం ఆర్జే కాజల్ హౌస్ పుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె రెమ్మునరేషన్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హైస్‌లో మొదటి నుంచి ఇంటి సభ్యుల కారణంగా అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంటూ వచ్చింది కాజల్. బిగ్‌బాస్ తన డ్రీమ్ అని చెప్పుకుంటూ వచ్చింది.. అయినా ఆమెని ఎవరూ పట్టించుకోలేదు.
బిగ్‌బాస్ బండారం బయటపెట్టిన రవి
గొడవల మారి అని.. తను హౌస్ నుంచి బయటికి వెళితేనే గొడవలు తగ్గుతాయని కారణం చెబుతూ షన్ను డైరెక్ట్‌గా నామినేట్ చేయడం పలువురిని షాక్ కి గురిచేసింది. అయినా సరే మొండి పట్టుదలతో తాన స్ట్రాటజీలతో ముందుకు వెళుతూ చివరి వారం వరకూ గట్టి పోటీనిస్తూ వచ్చింది. ఎవరు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా తాను ఎక్కడా తగ్గేది లేదు అంటూ మొండిగానే ముందుకు సాగింది. 14 వారాల పాటు గట్టి పోటీనిస్తూ నిలబడి చివరికి ఈ ఆదివారంఎలిమినేట్ అయింది.
అయితే ఈ 14 వారాలకు గానూ కాజల్ కి ఎంత రెమ్యునరేషన్ అందిందన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హౌస్ లోకి వచ్చే ముందు వారానికి కాజల్ కి 2 లక్షలు పారితోషికంగా ఫిక్స్ చేశారట. అంటే 14 వారాలకు ఆమెకు పారితోషికంగా 30 లక్షలు అందినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం అప్పు తనకు వుందని ముందే చెప్పిన కాజల్ ఆ మొత్తంలో తన అప్పుని తీర్చుకుంటుందని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



