English | Telugu
వన్ వీక్ హోస్ట్ గా వీజే సన్నీ
Updated : Jun 7, 2022
బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యులకు అవకాశం ఇచ్చింది స్టార్ మా. ఐతే ఇప్పటికే ఈ హౌస్ లోకి వెళ్ళడానికి అప్లై చేసుకున్న వాళ్ళతో వన్ వీక్ గేమ్ ఆడించి అందులో విన్ ఐన వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. అనుకున్నట్టుగానే వీళ్ళతో ఒక వారం గేమ్ ఆడించారు. ఈ వన్ వీక్ ప్రోగ్రాం కి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హోస్ట్ గా చేశాడు. దీని షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.
ఇక ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ రాబోతున్నారట. వీళ్ళు వచ్చి సామాన్యులతో హౌస్ లో గేమ్స్ ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 షో అనేది సెలబ్రిటీస్ v/s కామన్ మాన్ షోగా మారబోతోంది. ఐతే కామన్‌మెన్ తో నిర్వహించే ఈ షోలో ఎలాంటి కొత్త గేమ్స్ ఆడించబోతున్నారు ? ఎలాంటి టాస్క్స్ ఇవ్వబోతున్నారు. ? అసలు కామన్‌మెన్‌కు, సెలబ్రిటీస్ కి మధ్య ఎలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు జరగబోతున్నాయి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.