English | Telugu

హోటల్‌కి వెళ్తే విష్ణుప్రియ చేసే మొదటి పని ఇదా!

బుల్లితెరపై యాంకర్‌గా పలు షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. యాంకర్ శ్రీముఖి 'పటాస్' షో నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ విష్ణుప్రియకు దక్కింది. ఈ షోలో యంగ్‌స్ట‌ర్స్‌తో కలిసి విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలానే సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' అనే షోతో విష్ణుప్రియ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ గోవాకు వెళ్లి అక్కడ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.

కొద్దిరోజులుగా విష్ణుప్రియ బుల్లితెరకు దూరమైంది. ఈ మధ్యకాలంలో ఆమె ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఎక్కువగా జిమ్ లో వర్కవుట్లు చేస్తూ తన ఫిజిక్‌ను కాపాడుకుంటుంది. జీరో సైజ్ కోసం చాలా శ్రమిస్తోంది. గత వారంలో ఆమె మిర్రర్ సెల్ఫీలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ తన సీక్రెట్ విషయాన్ని ఒకటి లీక్ చేశారు.

రీసెంట్‌గా విష్ణుప్రియ ఓ హోటల్‌కి వెళ్లినట్లుంది. మాములుగా అలా హోటల్‌కి వెళ్తే ముందుగా అక్కడ ఉండే పెన్సిల్ తీసుకొని ఏదొకటి రాస్తుందట. తాజాగా అలానే చేశానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఓ పేపర్ లో 'ఐ లవ్ యూ' అని రాసి త‌న‌ సంతకం కూడా పెట్టింది. తనకు ఇదో అలవాటు అని.. హోటల్ రూమ్ లో వెళ్లిన ప్రతీసారి చేసే మొదటిపని ఇదేనంటూ తన సీక్రెట్ ను లీక్ చేసింది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు.