English | Telugu

Biggboss 8 Telugu: అయిదుగురిని నామినేట్ చేసి బకరా అయిన విష్ణుప్రియ.. ఏడ్చేసిన నబీల్!

బిగ్ బాస్ సీజన్-8 లో తొమ్మిదవ వారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. సీజన్-5 లో మాదిరి నామినేషన్ చేసిన వారిని జైల్లో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. విష్ణుప్రియ మెగా ఛీఫ్ కారణంగా అయిదుగురిని నామినేట్ చేయాలంటూ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అయితే ఇదే తనని హౌస్ లో బకరాని చేసిందని చెప్పాలి.

ఇప్పటికి ఎనిమిది వారాలు గడిచినా ఓ క్లారిటీ లేకుండా.. అసలు ఆడది అనే విషయాన్ని మర్చిపోయి పృథ్వీకి బహిరంగంగా ముద్దులు ఇస్తూ, అతను ఎక్కడుంటే అక్కడ ఉండటం.. గంట ఎపిసోడ్ చూసే ఆడియన్స్ కంటే ఇరవైనాలుగు గంటలు హౌస్ లో ఉండే వాళ్ళే తనని ద్వేషిస్తున్న లెక్కచేయడంలేదు. దీనికి తోడు బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉండటంతో తనేం చెప్తే అదే చేస్తున్నారు. ఇక తన మాటలకి చేష్టలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. హౌస్ లో ఎవరేంటో కూడా తెలియని విష్ణుప్రియకి పగ్గాలు ఇచ్చారు. అది హౌస్ అందరిని చూసుకునే మెగా ఛీఫ్. దీనికి అర్హత కూడా లేని విష్ణుప్రియ.. తనని చీఫ్ చేసిన తన క్లాన్ సభ్యులని మర్చిపోయి.. మిగతా క్లాన్ వాళ్ళని నామినేట్ చేయకుండా సొంత క్లాన్ వాళ్ళని నామినేట్ చేసింది. ఇది నిజంగా చెత్త నామినేషనే. ఎందుకంటే తను చెప్పిన ఒక్క రీజన్ కూడా వ్యాలిడ్ లేదు.

వైల్డ్ కార్డ్స్ వచ్చాక నీలో ఫన్ యాంగిల్ కనపడటం లేదంటు నబీల్ ని నామినేట్ చేసింది విష్ణుప్రియ. నువ్వు పృథ్వీతోనే ఉంటే నేనెక్కడ కన్పిస్తానంటూ గట్టిగా ఇచ్చి పడేశాడు నబీల్. అయితే నబీల్ జైలుకెళ్ళాల్సి వచ్చింది. ఇక లోపలకి వెళ్ళాక ఏడ్చేశాడు‌ నబీల్. దాంతో లోపల ఉన్న ప్రేరణ ఓదార్చింది. గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ లని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఈ అయిదుగురి నామినేషన్ చేసిన చెప్పిన పాయింట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. ‌దీంతో ఈ సీజన్ లోనే వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ ట్రోల్ చేసేవారికి కంటెంట్ ఇస్తుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.