English | Telugu
అఖిల్‌ని నలిపేస్తానంటున్న విష్ణుప్రియ!
Updated : Nov 16, 2022
ఇటీవల "జరీ జరీ పంచెకట్టు" సాంగ్‌తో ఫుల్ ఫేమస్ ఐన యాంకర్ విష్ణుప్రియ. ఇటీవల ఆమె 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో సుడిగాలి సుధీర్‌తో కలిసి నటించింది. ఈమె లేటెస్ట్‌గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' షోకి గెస్ట్‌గా వచ్చింది.
ఇక ఈ షో హోస్ట్‌గా ఉన్న ప్రదీప్ "నీ క్రష్ ఎవరు?" అని విష్ణుప్రియను అడిగాడు.దానికి ఆమె "అక్కినేని అఖిల్" అని జవాబిచ్చింది. "అఖిల్ అంటే నాకు క్రష్. అతన్ని చూస్తే చాలు నలిపేస్తా" అన్నట్టుగా రెండు చేతులతో ఒక పోజ్ పెట్టేసరికి అందరూ షాకయ్యారు.
"అఖిల్ భయ్యా ఆ 'ఏజెంట్' మూవీలో వాడినవినిజమైన గన్నులైతేవెంటనే కాల్చేయ్" అని కౌంటర్ వేశాడు ప్రదీప్. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' అనే షోతో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది విష్ణుప్రియ. ఆ షో కొంత వరకు సక్సెస్ అయ్యేసరికి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఐతే సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్‌గా కెరీర్ పరంగా ఉండట్లేదు విష్ణుప్రియ.