English | Telugu

విష్ణుప్రియ ముక్కు గున‌ప‌మంత ఉంటుందా?

ఈటీవీలో ఇటీవ‌లే మొద‌లైన కామెడీ షో 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' న‌వ్వులు పూయిస్తోంది. వాలెంటైన్స్ డేకి ప్ర‌సారం చేసిన '2 గంట‌ల్లో ప్రేమించ‌టం ఎలా?' ఎపిసోడ్ ఎంత వినోదాన్నిచ్చిందో మ‌న‌కు తెలుసు. కామెడీ స్కిట్స్‌, డాన్స్ ప‌ర్ఫార్మెన్స్‌తో అల‌రిస్తోన్న ఈ షోలో ఫిబ్ర‌వ‌రి 28న ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్న‌ట్లు లేటెస్ట్ ప్రోమో తెలియ‌జేస్తోంది. ఈ ఎపిసోడ్‌లో 'తుపాకి రాముడు' బిత్తిరి స‌త్తి కూడా పార్టిసిపేట్ చేయ‌డం విశేషం.

కాగా టీవీ యాంక‌రింగ్‌కు అందాలు అద్దుతున్న యాంక‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందిన విష్ణుప్రియ డాన్స్ ప‌ర్ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్‌కు ఓ హైలైట్‌. 'గ‌బ్బ‌ర్ సింగ్‌'లో మ‌లైకా అరోరా డాన్స్ చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఐట‌మ్ సాంగ్‌ "కెవ్వు కేక"కు అదిరిపోయే ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది విష్ణుప్రియ‌. ఆమెను "మాస్ మ‌హారాణి" అంటూ ఇంట్ర‌డ్యూస్ చెయ్య‌డం గ‌మ‌నార్హం. ఆ ప‌ర్ఫార్మెన్స్ అయ్యాక ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన బిత్తిరి స‌త్తి "నాగుపాము లెక్కనే ఉన్నావ్ తెలుసా గిట్లా" అని పొగిడాడు. "థాంక్యూ" అని పాములా మెలిక‌లు తిరుగుతూ చెప్పింది విష్ణు. "ఎప్పుడైత‌వ్ మ‌ళ్లీ అమ్మాయ్ లెక్క" అని సీరియ‌స్‌గా అడిగాడు స‌త్తి. దానికి ఏం స‌మాధానం చెప్పాలో తెలీక మూతి అదోర‌కంగా పెట్టింది విష్ణు. దాంతో న‌వ్వుల‌తో స్టేజి ద‌ద్ద‌రిల్లిపోయింది.

ఇంకో క‌మెడియ‌న్ విష్ణుప్రియ‌ను చూపిస్తూ, "హ‌క్కూ, చెక్కూ ఈవిడ‌కుంది ముక్కూ" అన్నాడు న‌వ్వుతూ. "ఏ.. నీకు లేదా ముక్కూ" అని సీరియ‌స్ అయ్యింది విష్ణు. "నాకింతుంది.. నీకు గున‌ప‌మంతుంది" అని అత‌డు చేతులు బార్లా చాపి చెప్ప‌డంతో, "అమ్మో" అంటూ గుండె ప‌ట్టేసుకుందామె. దాంతో న‌వ్వులు వెల్లి విరిశాయ్‌. ఇలాంటి ఎన్నో న‌వ్వుల చ‌మ‌క్కుల‌తో ఫిబ్ర‌వ‌రి 28 ఎపిసోడ్ మ‌న ముందుకు రానున్న‌ది. 'జ‌బ‌ర్ద‌స్త్' లాంటి టాప్ కామెడీ షోని అందిస్తోన్న మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ షోనీ అందిస్తోంది.