English | Telugu

తుల‌సి చెప్పిన విష‌యాన్ని కార్తీక్‌తో దీప చెబుతుందా?

`స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన జంట‌గా న‌టిస్తున్న ఈ ధారావాహిక మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సీరియ‌ల్ టైమ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు పెట్టొద్దంటూ.. అలా పెడితే ప్ర‌తీ ఇంటిలోనూ రిమోట్ కోసం యుద్ధం జ‌రుగుతుంద‌ని సోష‌ల్ మీడియాలో తెగ రిక్వెస్ట్‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అంత‌గా పాపుల‌ర్ అయిన ఈ సీరియ‌ల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. డాక్ట‌ర్ బాబు కేసుని వాప‌స్ తీసుకున్నాన‌ని చెప్ప‌డంతో కంగుతిన్న దీప..త‌న‌కు తుల‌సి చెప్పిన విష‌యాన్ని డాక్ట‌ర్ బాబుతో ఎలా చెప్పాలి?.. అస‌లు చెప్పాలా వ‌ద్దా.. కానీ నాకు ఇంత కంటే వేరే దారే లేదే.. డాక్ట‌ర్ బాబులో వున్న అనుమానం పోగొట్ట‌డానికి ఇంత కంటే వేరే దారే లేదే.. చెప్పాలా వ‌ద్దా చెప్పేస్తే ఒక్క మోనితే కాదు వంద మంది మోనిత‌లొచ్చినా నా కాపురంలో చిచ్చు పెట్ట‌లేరు.. అని ఆలోచిస్తూ వుంటుంది దీప‌..

క‌ట్ చేస్తే గుడిలో మోనిత... నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలంటూ దేవుడిని అడుగుతుంటుంది. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన సౌంద‌ర్య "పిశాచాలు కూడా గుడికి వ‌స్తాయా?" అంటుంది.. మోనిత‌ని చూసి "రోజూ రా.. శీఘ్ర‌మేవ స‌ద్భుద్ది ప్రాప్తిర‌స్తు" అని పంచేస్తుంది. క‌ట్ చేస్తే దీప‌ని క‌లిసిన సౌంద‌ర్య విష‌యం తెలుసుకుని కార్తీక్‌కి విష‌యం చెప్పేయ‌మంటుంది.. కానీ తాను చెప్ప‌లేన‌ని దీప చెప్ప‌డంతో భావోద్వేగానికి లోన‌వుతుంది సౌంద‌ర్య‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? తుల‌సి చెప్పిన విష‌యాన్ని దీప త‌న భ‌ర్త కార్తీక్‌కి చెప్పి క‌నువిప్పు క‌లిగించిందా, లేదా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...