English | Telugu
'కార్తీక దీపం'లో షాకుల మీద షాకులు!
Updated : Feb 22, 2021
బుల్లితెర ధారావాహిక 'కార్తీక దీపం' రోజుకో మలుపు తిరుగుతూ మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సోమవారం 969వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ రోజు మోనిత ఏం చేయబోతోంది.. దాని వల్ల దీప ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది.. కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?.. అన్నదే ప్రధాన హైలైట్‌గా నిలవబోతోంది. విహారికి పిల్లలు పుట్టరని డాక్టర్ ద్వారా తెలుసుకున్న తులసి ఆ విషయాన్ని దీపకు చెబుతుంది.
ఇలాగైనా నీ కాపురం నిలబడితే చాలని చెబుతుంది. "ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని వాడుకోకపోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురాన్ని నిలబెడితే నాకు కావాల్సింది ఏముంది" అంటుంది తులసి.. కట్ చేస్తే .. కార్తీక్‌ని సౌందర్య "రేపే కదా కోర్టు?"` అనడుగుంది. "లేదు.. నేను కేసు విత్‌డ్రా చేసుకున్నాను" అంటాడు కార్తీక్.. "అదేంట్రా!" అంటూ షాకవుతుంది సౌందర్య. "నేను కోర్టుకు వెళ్లనంటే ఆనందించాల్సింది పోయి అప్సెట్ అవుతావేంటి మమ్మీ" అంటాడు.
ఇలా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే మధ్యలో మోనిత ఎంటరవుతుంది. తులసితో దీప మాట్లాడిన వీడియోను కార్తీక్‌కి, సౌందర్యకి చూపించి షాకిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? దీపని కార్తీక్ ఏమైనా అన్నాడా?.. తీర్థయాత్రలు తిరిగి వచ్చిన 'అర్ధపావు' భాగ్యం తన ఇంటికి వచ్చిన కార్తీక్‌ని ఏమడిగింది? .. దాంతో కార్తీక్ ఎందుకు షాకయ్యాడు? .. సౌందర్య చెప్పిన విషయం విని దీప ఎందుకు షాకయ్యింది?.. ఇంతకీ దీపకు సౌందర్య చెప్పిన షాకింగ్ విషయం ఏంటీ? అన్నది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.