English | Telugu

హాట్ ఫొటో షూట్‌తో విష్ణు ప్రియ ర‌చ్చ ర‌చ్చ‌!

బుల్లితెర యాంక‌ర్స్ ఒక‌రిని మించి ఒక‌రు అన్న‌ట్టుగా అందాల విందుకు రెడీ అంటూ పిచ్చెక్కిస్తున్నారు. శ్రీ‌ముఖి ఇటీవ‌ల గోవాలో విహ‌రిస్తూ వాట‌ర్ బేబీలా మారి అందాల విందు చేసిన విష‌యం తెలిసిందే. స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న కామెడీ స్టార్స్ స్టేజ్‌పై వ‌ర్ష‌ణి సౌంద‌ర‌రాజ‌న్ హాట్ హాట్ పోజుల‌తో స‌రికొత్త స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. తాజాగా ఈ జాబితాలో హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ చేరిపోయింది.

సుడిగాలి సుధీర్‌తో క‌లిసి పోరా పోవే` అనే షోని ర‌క్తిక‌ట్టించిన విష్ణు ప్రియ తాజాగా హాట్ షోతో ర‌చ్చ చేస్తోంది. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న 'విష్ణుప్రియ' క్రేజీ హీరోయిన్ త‌ర‌హాలో క్రేజ్‌ని ద‌క్కించుకుని త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది.

తాజాగా త‌ను చేస్తున్న 'పోరా పోవే' ప్రోగ్రామ్‌కి కాస్త బ్రేక్ ల‌భించ‌డంతో మేక‌ర్స్‌కి గాలం వేయ‌డానికి హాట్ హాట్ పోజుల‌తో విష్ణుప్రియ ర‌చ్చ చేస్తున్న ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి.

తాజాగా విష్ణుప్రియ బ్లాక్ షార్ట్‌తో పాటు అదే క‌ల‌ర్ లోదుస్తులు ధ‌రించి పైన వైట్ ష‌ర్ట్ వేసుకుని ఫొటోల‌కి పోజులిచ్చింది. అయితే ఇక్క‌డ పైన ధ‌రించి వైట్ ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి అందాల విందు చేస్తూ విష్ణుప్రియ ఫొటోల‌కు పోజులివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

'చెక్‌మేట్‌' మూవీలో త‌డిసిన అందాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష్ణుప్రియ తాజాగా సినిమా అవ‌కాశాల కోసం హాట్ షోకు సిద్ధం కావ‌డం గ‌మ‌నార్హం.