English | Telugu
శ్రీముఖి గోవా టూర్ ఖర్చు ఎవరిదో తెలిస్తే షాకే!
Updated : Feb 11, 2021
ఇటీవల బుల్లితెర స్టార్స్ శ్రీముఖి, ముక్కు అవినాష్, అరియానా, విష్ణు ప్రియ గోవా వెళ్లి అక్కడి బీచ్‌లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. శ్రీముఖి మాత్రం వీరందరికి భిన్నంగా వాటర్ బేబీగా మారి తడిసిన డ్రెస్సుల్లో ఓ రేంజ్‌లో అందాల కనువిందు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అభిమానులతో ఇన్ స్టా వేదికగా పంచుకుని మురిసిపోయింది.
విష్ణుప్రియ.. శ్రీముఖితో పోటీపడి ఎంజాయ్ చేసింది. ఇక ముక్కు అవినాష్ కూడా అదే స్థాయిలో అరియానాలో కలిసి రచ్చ చేశాడు. కానీ అరియానా మాత్రం రామ్‌గోపాల్ వర్మతో కలిసి ప్రత్యేకంగా ఈ అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకుంది. శ్రీముఖి గ్లామర్ షో ఈ టూర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే వీరంతా ఒకేసారి గోవా వెళ్లడానికి అసలు కారణం వేరే వుందని తెలిసింది.
`కోలా గోవా బీచ్ రిసార్ట్`ని ప్రమోట్ చేయడంలో భాగంగా వీరిని సదరు రెస్టారెంట్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారట. అందులో భాగంగానే `కోలా గోవా బీచ్ రిసార్ట్` ద్వారం వద్ద పేరు కనిపించేలా శ్రీముఖి, విష్ణుప్రియ ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ టూర్‌కి సంబంధించిన ఖర్చు మొత్తం వారిదే కావడంతో ఈ సీక్రెట్ తెలిసి మిగతావారంతా అవాక్కవుతున్నారు.