English | Telugu
మోనితకు టెన్షన్.. అత్తా కోడళ్ల కామెడీ!
Updated : Feb 10, 2021
స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియస్ టర్న్ తీసుకుంటున్నప్పటికీ దీప, ఆమె అత్త సౌందర్యతో కలిసి కామెడీని పండించేస్తోంది. దీంతో మహిళా ప్రేక్షకుల్లో ఒకింత ఆనందం.. ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఈ బుధవారం ఎపిసోడ్ మరింత రసవత్తర మలుపులతో సాగబోతోంది. డాక్టర్ బాబు అడుగులు మోనితకు వ్యతిరేకంగా పడుతున్న నేపథ్యంలో ఎపిసోడ్ కీలక మలుపులు తిరగబోతోంది.
అయితే సీరియస్ గా సాగే ఈ ఎపిసోడ్‌లో అత్తా కోడళ్లు దీప, సౌందర్య కామెడీ హైలైట్‌గా నిలవబోతోంది. "రెండు రోజులు నీతో వుంటాను నాన్నా" అంటూ డాక్టర్ బాబుతో ఇంటికి వచ్చేసిన శౌర్య చిన్న చిన్నగా తనని మార్చడం మొదలుపెడుతుంది. టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేద్దామంటూ తీసుకెళ్లి కార్తీక్ తో టిఫిన్ తినిపించేస్తుంది. ముందు అయిష్టంగానే టిఫిన్ బండి దగ్గరికి వచ్చినా కార్తీక్ ఆ తరువాత శౌర్య చెప్పిన మెనూ అద్భుతంగా వుండటంతో లొట్టలేస్తూ తింటుంటాడు. ఇంతలో అక్కడికి అత్త సౌందర్యని తీసుకుని దీప స్కూటీపై వస్తుంది.
అక్కడ కార్తీక్‌ని చూసి ముందు ముఖం చిట్లించుకున్నా శౌర్యతో కలిసి టిఫిన్ చేస్తుండటం చూసి ఆనందిస్తుంది. దీప మాత్రం ఈ చూడముచ్చటైన దృశ్యం చూసి సంబరంతో గాల్లో తేలిపోతోంది. ఇక గురువారం ఎపిసోడ్ మోనితకు టెన్షన్‌గా.. వుంటే దీపకు, సౌందర్యకు కామెడీగా వుంటుంది. మోనిత బండారాన్ని బయటపెట్టే ఆధారం కార్తీక్ చేతికి చిక్కుతుంది. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోనితకు మరో ఆధారం లభిస్తుంది. అదేంటీ? దాన్ని అడ్డు పెట్టుకుని కార్తీక్‌తో మోనిత ఆడిన నాటకం ఏంటీ అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.