English | Telugu
విష్ణుప్రియను వదలని హ్యాకర్స్.. మళ్ళీ అశ్లీల వీడియోల దర్శనం!
Updated : Nov 1, 2022
యాంకర్ విష్ణుప్రియను హ్యాకర్స్ వదలడం లేదు. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు పోస్ట్ చేసి ఆమెను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఇటీవల విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అధికారిక ఖాతాలో అశ్లీల వీడియోలు కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన విష్ణుప్రియ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, అందరూ అన్ ఫాలో చేయాలని కోరింది. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి ఆ వీడియోలు డిలీట్ అవ్వడంతో ఆమె హ్యాకర్ల బారి నుంచి బయటపడ్డారని అనుకున్నారంతా. కానీ ఆమెను హ్యాకర్స్ వదలడం లేదు. 3.7 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్న ఆమె అధికారిక ఖాతా నుంచి తాజాగా హ్యాకర్లు మళ్ళీ అశ్లీల వీడియోలను స్టోరీస్ గా పోస్ట్ చేశారు. హ్యాకర్లు చేస్తున్న ఈ పని విష్ణుప్రియకు పెద్ద తలనొప్పిగా మారింది.