English | Telugu
గీతు మాట తీరుకి కన్నీరు పెట్టుకున్న ఆదిత్య!
Updated : Nov 2, 2022
మంగళవారం బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ మొదలైంది. అందులో రెండు టీం లు పాల్గొన్నాయి. అందులో గీతు ఒక టీం లో ఉండగా, రేవంత్ మరో టీం లో ఉన్నాడు. అయితే ఈ గేమ్ లో ఆదిత్య, గీతుని నమ్మి తన లైటర్ ఇచ్చాడు. అయితే తను మాత్రం హ్యూమానిటి లేకుండా నీకు లైటర్ కావాలంటే నాకు టూ స్ట్రిప్స్ ఇవ్వు అని ఆదిత్యతో అంది. అలా వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదిత్య కి సపోర్ట్ గా రేవంత్ మాట్లాడుతూ, "గీతు నువ్వు చేసేది తప్పు" అని అన్నాడు. గీతు మాత్రం ఎవరు ఏం అన్నా కూడా పట్టించుకోకుండా, "నా గేమ్ ఇంతే. నేను ఇలాగే ఆడుతాను" అని గీతు అంది.
"నీ లైటర్ నీకు కావాలంటే రెండు స్ట్రిప్స్ ఇవ్వు" అని గీతు అనగా, ఆదిత్య మాట్లాడుతూ, " నువ్వు మారవా..అందరూ నిన్ను నమ్మొద్దు అన్నా కూడా నేను ప్రేమతో దగ్గరయ్యా నీకు" అని చెప్పుకొచ్చాడు.
"ఎంత నమ్మాను నిన్ను. నువ్వు కొంచెం కూడా హ్యూమనిటీ లేకుండా అలా ఎలా మాట్లాడుతావ్" అని ఆదిత్య ఏడ్చేసాడు. ఆదిత్య ఏడ్వడం ఇదే తొలిసారి. ఎప్పుడు అందరితో కలిసిపోయి ఉండే ఆదిత్య , ఎవరు ఏమైనా మాట జారినా కూడా వాళ్ళకి తప్పు అని వివరించే ప్రయత్నం చేస్తాడు. ఆదిత్య ఏడ్వడం చూసి హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ ఎపిసోడ్ తో నామినేషన్లో ఉన్న ఆదిత్యకి ఒక్కసారిగా ఓటింగ్ పెరుగుతుంది. చూడాలి మరి ఈ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామెన్స్ చేస్తారో? .