English | Telugu

Guppedantha Manasu Today Episode :  రిషి, వసుధారల రొమాంటిక్ సీన్.. విష్ కాలేజ్ కి వాళ్ళిద్దరు వెళ్తారా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -913 లో.. రిషి వసుధార ఇద్దరు కాలేజీకీ వెళ్తారు. చాలా రోజుల తర్వాత రిషి తన కాలేజీలో స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పారు. దాంతో స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా రిటైర్డ్ లెక్చరర్స్ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తారు.

మరొక వైపు వసుధార దగ్గరికి ఇద్దరు లెక్చరర్స్ వచ్చి జీతాలు పెంచమని అడిగినందుకు వేరే ఫాకల్టీని తెచ్చుకున్నారు. మేమ్ యూనియన్ తో కాలేజీ ముందు ధర్నా చేస్తామని అనగానే అప్పుడే అక్కడకి వచ్చిన రిషి.. మీరు ఏమైనా చేసుకోండి. మీరు మాకు టైమ్ ఇవ్వకుండా క్లాస్ లు ఆపేసారు. అందుకే ఇలా చేసామని రిషి అంటాడు. వాళ్ళని తిరిగి పంపించండి మేమ్ వస్తామని ఫ్యాకల్టీ చెప్తారు. అవసరం లేదు. వాళ్ళని తిరిగి పంపించం, అలా అని మిమ్మల్ని వద్దని అనట్లేదని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఆ ఫ్యాకల్టీకి తిక్క కుదిరి మేమ్ కాలేజీ కీ వస్తామని చెప్తారు. కాసేపటికి ఎండీ చైర్ అనేది ఒక ముళ్ల కుర్చీ. ఆ సీటు కోసం నాపై ఎటాక్ జరిగింది.

నీకు తెలుసు. అయిన నా మాట కాదనలేక గౌరవంతో కూర్చున్నావ్. నువ్వు గ్రేట్ అంటూ వసుధారని రిషి పొగుడుతాడు. మరొక వైపు రిషి చెప్పినట్టు రిటైర్డ్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి క్లాస్ లు రన్ చేస్తున్నాడు. రిషి సామాన్యుడు కాదని దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి చెప్తాడు. రిషిని దెబ్బ కొట్టాలంటే కుట్రలతో కాదు ప్రేమతో దెబ్బకొట్టాలని దేవయాని చెప్తుంది.

మరొకవైపు రిషి వసుధార ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసి.. విష్ కాలేజీ ప్రిన్సిపల్ పాండియన్ ని పిలిచి మాట్లాడతాడు. రిషి వసుధారలని కాలేజీకీ పిలుద్దామని అనుకుంటున్నాను. అందుకు కావలసిన వెల్ కమ్ ఏర్పాట్లు చూడమని పాండియన్ కి ప్రిన్సిపల్ చెప్తాడు. మరొక వైపు రిషి దగ్గరికి వసుధార వచ్చి.. మీరు చాలా చేంజ్ అయ్యారు. మొదట్లో బాగా స్టైల్ గా ఉండేవారంటు తన జ్ఞాపకాలు చెప్తూ‌ ఉంటుంది. ఆ తర్వాత వసుధార దగ్గరగా రిషి రొమాంటిక్ చూస్తూ వస్తుంటే.. వసుధార బయపడుతుంది. అప్పుడే విష్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి.. తమ కాలేజీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. దానికి వసుధార, రిషి ఇద్దరు సరే అంటారు. ఆ తర్వాత ఇద్దరు రెడీ అయి హాల్లో ఉన్న మహేంద్రకి విష్ కాలేజీ కీ వెళ్తున్నామని చెప్తారు. దాంతో మహేంద్ర వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.