English | Telugu

రిషికి వసుధార అసలు నిజం చెప్పనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -848 లో.. మీ పెళ్లి ఎప్పుడు సర్ అని రిషికి వసుధార మెసేజ్ చేయగానే.. రిషి షాక్ అవుతాడు. వెంటనే వసుధారకి కాల్ చేస్తాడు. కావాలనే వసుధార ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఏమైంది? ఎందుకు నన్ను ఇలా అడిగిందని, ఎలాగైనా వసుధారనే అడగాలని రిషి అనుకుంటాడు.

మరొకవైపు ఫణింద్ర దగ్గరికి దేవయాని వచ్చి.. ఈ మధ్య మీరు చాలా కోపంగా ఉంటున్నారు. మన కొడుకుని తిడుతున్నారు, వాడు అమెరికా వదిలి మనతో ఉండడానికి వస్తే.. మీరు చీటికిమాటికి వాన్ని తిడుతుంటే, వాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. వాడిని సరైన మార్గంలో మీరే పెట్టాలి. వాడికి కాలేజీ పనులు దగ్గర ఉండి మేరే చెప్పాలని ఫణింద్రతో దేవయాని చెప్తుంది. అలాగే దేవయాని నేను కొప్పడను, అలా అని అలుసుగా తీసుకోకని చెప్పు. ఇది నీకోసం, నీ కొడుకు కోసం కాదు.. ఈ ఇంటి కోడలి కోసం వాళ్ళు సంతోషం ఉండాలి. అది నువ్వే చెయ్యాలని ఫణీంద్ర చెప్తాడు. మరొకవైపు వసుధార సుమిత్ర ఫొటోని తీసుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వచ్చిన చక్రపాణి.. ఎందుకు తీసావని అడుగుతాడు. రిషి సర్ వస్తే, అమ్మ ఫోటో చుస్తే అమ్మ చనిపోయినట్లు తెలుస్తుంది. అలా తెలిసి జాలితో నాకు దగ్గర కావడం ఇష్టం లేదు. అందుకే అమ్మ ఫోటోని నా గదిలో పెట్టుకుంటానని చక్రపాణితో చెప్తుంది వసుధార.. ఆ తర్వాత వసు డోర్ వేస్తుంటే రిషి వచ్చి ఆపుతాడు. రిషిని చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. మీతో మాట్లాడాలని వసుధరని రిషి అడుగుతాడు. ఈ టైమ్ లో ఇలా మీరు వచ్చి మాట్లాడితే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీరు వెళ్ళండి సర్ మీ మొహం పై తలుపు వెయ్యడం ఇష్టం లేదని వసు అంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళకపోయేసరికి తన మొహం పైనే డోర్ వేస్తుంది వసుధార. రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిషిని బాధపెట్టినందుకు వసుధార కూడా తనలో తానే బాధపడుతుంది.

మరొక వైపు రిషి ఒక దగ్గర ఆగి ఎమోషనల్ అవుతాడు. వసుధార ఎందుకు ఇలా చేస్తుంది. అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటే.. నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను. అన్నింటికి బాధ నాకేనా? అన్ని ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారని రిషి అనుకుంటాడు. అప్పుడే నేను చెప్తానంటూ రిషి దగ్గరికి వసుధార వస్తుంది. మీరు ఎంత బాధపడుతారో తెలిసి ఇక్కడికి వచ్చాను. అడగండి ఏం అడగాలి అనుకుంటున్నారని వసుధార అంటుంది. ఆ మెసేజ్ ఎందుకు చేసావ్ ? నేను వేరేవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటానని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.