English | Telugu
శివుడిని ధ్యానిస్తూ ఆవుకు అరటిపళ్ళు తినిపిస్తున్న గుప్పెడంత మనసు జగతి మేడం
Updated : Jan 4, 2026
జ్యోతి పూర్వాజ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అందులో రిషి రోల్ కి తల్లిగా జగతి మేడంగా బాగా పేరు తెచ్చుకుంది. హాట్ ఫొటోస్ తో ఆడియన్స్ ముందు కనిపించే జ్యోతి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇంటరెస్టింగ్ అండ్ డివైన్ ఫొటోస్ తో కనిపించింది.
శివాలయానికి వెళ్లిన జ్యోతి శివుడిని ఆరాధిస్తూ ఆయన ధ్యానంలో మునిగితేలుతోంది. అలాగే అక్కడే ఉన్న గోశాలలో ఆవులకు అరటిపళ్ళు తినిపిస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక నెటిజన్స్ ఆమె పెట్టె ప్రతీ పోస్ట్ కి నెగటివ్ గా కామెంట్స్ చేసేవాళ్ళు కానీ ఈ పిక్స్ దగ్గర మాత్రం ఎలాంటి బాడ్ కామెంట్స్ పెట్టలేదు. "బాహ్యప్రపంచానికి దూరంగా, మనస్సుకు దగ్గరగా..హ్యాపీ జనవరి మేడం గారు..ఇదే అసలైన నువ్వు" అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు.
ప్రస్తుతానికి జ్యోతి పూర్వాజ్ బుల్లితెర బ్రేక్ ఇచ్చింది. "కిల్లర్" అనే మూవీలో ఆమె ఒక ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమె నటనకు మంచి మార్క్స్ పడ్డాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు.