English | Telugu
ఆసక్తిని రేకెత్తిస్తున్న బ్రహ్మముడి ప్రోమో!
Updated : Aug 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ తో సినిమాని తలపిస్తున్న ఈ సీరియల్ కి విశేష స్పందన లభిస్తుంది. ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వస్తున్నాయంటే ఈ సీరియల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బ్రహ్మముడి సీరియల్ లో ప్రధానంగా రెండు కుటుంబాల చుట్టూ సాగుతుంది. ఒకటి ధనవంతులైన దుగ్గిరాల కుటుంబం. మరొకటి మిడిల్ క్లాస్ అయిన కనకం, కృష్ణమూర్తి కుటుంబం. అయితే మొదటి నుండి గొప్పింటికి తన కూతుళ్ళని ఇవ్వాలని కలలు కన్న కనకం కల నేరవేరింది. కావ్యని రాజ్ కి ఇచ్చి పెళ్ళి చేయగా, స్వప్నని పెళ్ళి రాహుల్ తో జరుగుతుంది. అయితే కావ్య దుగ్గిరాల ఇంట్లో ఉండటం ఇష్టం లేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ.. ఎప్పుడు కావ్య దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటుంది. మరొకవైపు స్వప్నతో రాహుల్ పెళ్ళి ఇష్టం లేని రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి.. ఎప్పుడు స్వప్నని ఇరికించి పంపించేద్దామా అని ఎదురుచూస్తుంటుంది. అయితే స్వప్నకి రుద్రాణి, రాహుల్ ల నిజస్వరూపం తెలియదు. అలాగే స్వప్నకి తన సొంత చెల్లి కావ్య అంటే అస్సలు గిట్టదు. దాంతో కావ్యకి ఇంట్లో ఆదరణ కరువవుతుంది.
తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో.. కావ్య వాళ్ళింటికి రాజ్ వచ్చి మట్టి పిసుకుతుండగా మీడియా వాళ్ళు ఫోటో తీసి టీవిలో వచ్చేలా చేస్తారు. దాంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. కావ్య దుగ్గిరాల ఇంటికి రాగానే అపర్ణ సూటిపోటి మాటలతో తిడుతుంది. అయితే అక్కడే ఉన్న ఇంటి పెద్దలు సీతారామయ్య, ఇందిరాదేవిలు కూడా ఏం చేయలేని పరిస్థితి.. అప్పుడు రాజ్ వచ్చి తన తల్లికి కావ్య ఎదురుతిరిగేలా మాట్లాడినందుకు ఇంటి నుండి గెంటేస్తాడు రాజ్. వర్షంలో తడుస్తున్న కావ్యని కనకం, కృష్ణమూర్తి ఇంట్లోకి తీసుకొచ్చి.. అందరిని అడుగుతారు. కొంచెం కూడా జాలి లేకుండా కావ్యకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ఇలా చేస్తారా? అంటూ కనకం ఏడ్చేస్తుంది. తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనకం మాటలు ప్రతీఒక్కరిని కదిలిస్తాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన బ్రహ్మముడి ప్రోమోకి విశేష స్పందన లభిస్తుంది. ఈ ప్రోమోకి కామెంట్ల వర్షం కురుస్తుంది. ఈ సీరియల్ చూస్తున్న ఒక్కో అభిమాని ఎమోషనల్ గా ఉంది ఎపిసోడ్ అంటూ.. కావ్యని కోడలిగా అంగీకరించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తూ నిన్నటి ఎపిసోడ్ ని ముగించాడు డైరెక్టర్.