English | Telugu

అందుకే జబర్దస్త్ మానేస్తున్నా!

జబర్దస్త్ కమెడియన్ వర్ష షాకింగ్ నిర్ణయం ఒకటి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వర్షపై ఇమ్మానుయేల్ వేసే పంచులు చాలా వల్గర్ గా ఉంటున్నాయని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ గురించి సోషల్ మీడియా ట్రోల్స్ కూడా బాగా పెరిగిపోయేసరికి ఇంట్లో వాళ్ళు జబర్దస్త్ షో మానేయమని చెప్తున్నారని, కాబట్టి షో మానేస్తానని చెప్పి అందరికీ షాకిచ్చింది వర్ష.

ఒక పక్కన ఇమ్మానుయేల్ దారుణంగా కామెంట్ చేస్తూనే మరోవైపు వర్ష బర్త్ డేకి మంచి హారాన్ని కొనిచ్చేసరికి "మీరు పెళ్లి చేసుకుంటారా?" అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ తమ మధ్య అలాంటిది ఏమీ లేదని, తాము మంచి ఫ్రెండ్స్ అని వారు చెప్తున్నారు.

ఐతే ఇలాంటి ట్రోలింగ్స్ అవీ చూసాక ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు వర్ష సన్నిహితులు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇలాంటి టైములో జబర్దస్త్ మానేయాలి అని ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి తాను అదే ఆలోచనలో ఉన్నాననేసరికి అందరూ షాకయ్యారు. నిజంగా ఇంట్లో వాళ్ళు చెప్పారనే మానేస్తానంటోందా, లేదా ఏదైనా మూవీలో ఆఫర్ వచ్చిందా? లేదా ఇమ్ము టార్చర్ భరించలేక షాక్ ఇవ్వడానికే ఇలాంటి కామెంట్స్ చేసిందా.. అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.