English | Telugu
Brahmamudi : నీ మనసు నాకు తెలుసు.. వాళ్ళదే గెలుపు!
Updated : Jul 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -459 లో....అపర్ణ దగ్గరికి పనిమనిషి వస్తుంది. పనిమనిషికి పెళ్లి రోజు కానుకగా సుభాష్ ఇచ్చిన చీర ఇస్తుంది. ఇంత ఖరీదైన చీర ఇచ్చారని పనిమనిషి అడుగుతుంది. నీకు మంచి చీర కట్టుకోవాలని ఉంటుంది కదా అందుకే అని అపర్ణ అనగానే పనిమనిషి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కోపంగా సుభాష్ ని ఉద్దేశించి.. నేను ఎప్పటికి మిమ్మల్ని క్షమించనని అపర్ణ అనుకుంటుంది. అదంతా చూస్తున్న రుద్రాణి ఏదో జరుగుతుందని అనుకుంటుంది.
ఆ తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. రాజ్ , కావ్య హాల్లో ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఎందుకు బోర్డు పెట్టారని రుద్రాణి అడుగుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని రాస్తున్నారా అని ప్రకాష్ అనగానే.. వాళ్ళు రూల్స్ పాటిస్తారా ఏంటని స్వప్న అంటుంది. ఈ రోజు మమ్మీ డాడ్ పెళ్లి రోజు అని రాజ్ చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళకి విషెస్ చెప్తారు. ఓహ్ జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ కలిసిపోయారా అని రుద్రాణి అంటుంది. లేకపోతే మీలాగా పుట్టింట్లో ఉంటారా అని స్వప్న అంటుంది. ఆ తర్వాత ఇద్దరు సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి వాల్లని విష్ చేసి.. ఇప్పుడు చెప్పండి అన్నయ్య.. వీళ్ళ పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం.. అందరం కలిసి ఆ ఇద్దరికి గుర్తుండిపోయేలా ఎలా చేద్దామని కళ్యాణ్ అంటాడు.అమ్మ నాన్నల పెళ్లి రోజు కాబట్టి ఇన్ని రోజులు ఒకరినొకరు చాలా అర్థం చేసుకొని ఉంటారు. అందుకే ఈ రౌండ్ పేరు 'నీ మనసు నాకు తెలుసు' అని రాజ్ అనగానే.. నాకు అర్థం అయింది.. గేమ్ పేరు ముఖాభినయం అని కళ్యాణ్ అంటాడు. దీనికి జడ్జి గా అమ్మమ్మ, తాతయ్యలు ఉంటారని కావ్య అంటుంది. ముందుగా అపర్ణ సుభాష్ లు వెళ్తారు. ఇందిరాదేవి అపర్ణకి నిన్నే ప్రేమిస్తున్నా అని సినిమా పేరు చెవిలో చెప్తుంది. దాన్ని అపర్ణ సైగల ద్వారా సుభాష్ కి చెప్తుంది. సుభాష్ దాన్ని గెస్ చేసి చెప్తాడు.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి , ప్రకాష్ స్వప్న , రాహుల్ , కావ్య, రాజ్ లు ఆడతారు కానీ ఎవరు గెస్ చెయ్యలేదు. ఈ రౌండ్ విన్నర్ అంటూ ఇందిరాదేవి సుభాష్, అపర్ణల పేర్లు చెప్తుంది.ఆ తర్వాత రౌండ్లో అపర్ణ, సుభాష్ ల కళ్ళకి గంతలు కట్టి ఒకరు పెళ్లి చూపులకి వచ్చినప్పుడు.. ఏం మాట్లాడారు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారని ఇద్దరి ఆన్సర్ మ్యాచ్ అవుతాయో లేదోనని అనుకుంటారు. ఇద్దరి ఆన్సర్ మ్యాచ్ అవుతాయి. తరువాయి భాగంలో పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని కాఫీ తీసుకొని వస్తుంది. కావాలనే ఈ చీర ఎక్కడిదని రుద్రాణి అడుగగా.. అపర్ణ అమ్మ ఇచ్చిందని పనిమనిషి చెప్పగానే.. రాజ్, కావ్య, సుభాష్ లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.