English | Telugu

కుమారిగా ఉంటేనే లైఫ్ ప్రశాంతం.. లేదంటే డైపర్లు పట్టుకుని తిరగాలి!

శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ శుక్రవారాలు, మహాలక్ష్మి వ్రతాలు ఇళ్లన్నీ పండగ వాతావరణంతో సందడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బుల్లితెర మీద ఈవెంట్లు, షోలు ఎక్కువగానే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో "మా వరలక్ష్మి వ్రతం" త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ కి ఉదయభాను హోస్ట్ గా వస్తోంది. ఇందులో "కుమారీలు వెర్సెస్ శ్రీమతులు" అనే థీమ్ తో పెళ్లి కానీ వాళ్ళను పెళ్ళైన వాళ్ళను తీసుకొచ్చి గేమ్స్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్ మధ్య రచ్చ కూడా మాములుగా లేదు. జ్యోతక్క అలియాస్ శివజ్యోతికి కోపం వచ్చేసింది " మీరు కేవలం కుమారీలు మాత్రమే.. అంత బిల్డప్ అవసరం లేదు" అని కుమారీలను ఉద్దేశించి అనేసరికి " మీరంతా శ్రీమతులే..శ్రీమంతుడు మూవీలో శృతిహాసన్ కాదు" అంటూ కుమారీల టీమ్ నుంచి ప్రేరణ శ్రీమతులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. దానికి అవినాష్ షాకయ్యాడు.

ఇక ఈ షోకి "బేబీ" ఫేమ్ వచ్చేసింది. మస్త్ డాన్స్ చేసి ఎంజాయ్ చేసింది. "కుమారీలుగా ఉంటేనే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది" కదా అని ఉదయభాను అడిగేసరికి "లేదంటే సంకలో పిల్లల్నెత్తుకుని మరో చేతిలో డైపర్లు పెట్టుకుని వెళ్తూ ఉండాలి" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఈ షోలో బుల్లితెర జోడీస్ డాన్సస్ చేసేశాయి. ఇక ఈ వరలక్ష్మి వ్రతం ఈవెంట్ లో అవినాష్ వైఫ్ అనుజకి సీమంతం వేడుకను నిర్వహించారు. ఈసారి "మాటీవీ వరలక్ష్మి వ్రతం ఎంటెర్టైన్మెంటే మొత్తం" అని చెప్పింది ఉదయభాను.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.