English | Telugu

33 ఏళ్ళు అవుతున్నా నాకేం కావాలో ఆయనకు తెలీదు!

"నీతోనే డాన్స్" షో ఈవారం సెమీఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారం రెండు టీమ్ లు వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాయి. ఆట సందీప్-జ్యోతి డాన్స్ చూసి ఫుల్ ఫిదా ఐపోయిన రాధను శ్రీముఖి తన పెళ్లి గురించి అడిగేసరికి ఆమె ఎన్నో విషయాలను చెప్పారు.

"సెప్టెంబర్ 9 వస్తే మా పెళ్ళై 33 ఏళ్ళు. పెళ్లి గురించి మ్యారేజ్ లైఫ్ గురించి నాకు ఎక్కువ అవగాహన ఉంది. నా ఫామిలీతో నాకు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఈ ఫోటో చాలా ఓల్డ్ ది.. దీని వెనక చాలా మెమోరీస్ ఉన్నాయి. ఐ లవ్ ఫొటోస్. కొన్ని సందర్భాల్లో మెమోరీస్ అన్నీ కూడా గుర్తుండవు కదా. అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే ఆ మెమరీ గుర్తొస్తుంది. కానీ నేను ఫోటో తీసుకోవాలని అనుకున్నప్పుడు కార్తీక నా మీద అరుస్తుంది. అమ్మా ఎంజాయ్ ది మూమెంట్ అంటుంది... ఒకే మా నేను మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నాకు ఈ మెమరీ గుర్తురావడం కోసం ఫొటోస్ తీసుకుంటున్నా అని చెప్తుంటాను నేను మళ్ళీమళ్ళీ ఆ మొమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే ఫోటో అనేది ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే నా టార్గెట్ 5 కిడ్స్. ఇంకో ట్విన్స్ కోసం అలా ప్రార్ధించాను. ఒకసారి ఓనం సెలెబ్రేషన్స్ టైంలో ఇల్లంతా పిల్లలతో కళకళలాడిపోతోంది. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది నీకు మినిమం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పింది. కుదిరితే 8 మంది పిల్లలుంటే బాగుండు అనుకున్నా అందులో అందరూ ట్విన్స్ ఉండాలి. ఐ లవ్ కిడ్స్ అని కాదు కానీ ఇప్పుడు నా పిల్లల్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరినీ చూసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మా ఆయన ఇప్పటికీ ఒకటి అడుగుతారు..ఎం కావాలే నీకు అని అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లమ్ అంటారు.. నేను చెప్పను అంటాను... 33 ఇయర్స్ ఐపోతోంది ఇంకా నీకు ఏమీ తెలీదంటే గో టు హెల్ అని అంటుంటాను" అని తన పెళ్లి గురించి ఎన్నో మెమోరీస్ ని నీతోనే డాన్స్ షోలో జడ్జి రాధ షేర్ చేసుకున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.