English | Telugu

నేహాతో మనోజ్ ముచ్చట్లు..ఆటలో అరటిపండులా విశ్వక్ సేన్... 



ఉస్తాద్ ఈ వారం షోకి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో మంచు మనోజ్ ఆడుకున్నాడు. ఈ ఎపిసోడ్ లో ఆన్సర్ చెప్పి దానికి ప్రశ్నలు అడిగే ఒక సెగ్మెంట్ ఉంది. అందులో భాగంగా ఆగస్ట్ 22 అని ఆన్సర్ చెప్పి ప్రశ్నలు అడిగాడు మనోజ్. నేహాసెట్టి పుట్టినరోజు, నివేత పేతురాజ్ పుట్టినరోజు, అనీషా అమ్రోస్ పుట్టినరోజు, తరుణ్ భాస్కర్ పుట్టినరోజు అని వీటిల్లో కరెక్ట్ ప్రశ్నచెప్పాలని అడిగాడు. ఆన్సర్ చెప్పకపోయేసరికి "ఆ ప్రశ్నతో ఒక గొడవయ్యేసరికి రెండేళ్లు మాట్లాడుకోలేదు" అని చెప్పాడు. దానికి అనీషా అమ్రోస్ పుట్టినరోజు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు విశ్వక్.

ఐతే ఆన్సర్ కరెక్ట్ చెప్పాక ఆడియన్స్ లోంచి జతిన్ అనే ఒక కుర్రాడు ఫస్ట్ క్వశ్చన్ అంటూ చూపించేసరికి అదే ఆన్సర్ అనుకున్నా కానీ ఇప్పుడు అనిషా ఫోటో చూపించేసరికి క్లాప్స్ కొడుతున్నాడు అని ఫీల్ అయ్యాడు విశ్వక్. తర్వాత నేహాకి ఫోన్ చేయించాడు మనోజ్. "నేనెవరో చెప్పు" అనేసరికి నేహా కరెక్ట్ గా "విశ్వక్" అని చెప్పింది. "ఏంటి నేను లైవ్ లో మాట్లాడుతున్నానా" అని నేహా అనేసరికి "అవును మై బేబీ పొటాటో ఎలా ఉన్నావు" అని కామెడీగా అడిగాడు మనోజ్. ఇక విశ్వక్ కి కోపం వచ్చి "ఫోన్ చేయించి వాళ్ళూవాళ్ళూ మాట్లాడుకుంటున్నారు ..మనం ఆటలో అరటిపండు" అన్నాడు. "ఇంతకు నీ పుట్టినరోజు ఎప్పుడు" అని అడిగేసరికి "డిసెంబర్ 5 " అని చెప్పింది నేహా...తర్వాత ఫోన్ కట్ చేసాక "నేహాతో చాలా కంఫర్ట్ గా మాట్లాడావుగా అని మనోజ్ కొంచెం ఎక్కువగా మాట్లాడేసరికి "కంఫర్ట్ గా మాట్లాడింది బేబీ అన్నది ఎవరో చూసారుగా మీరంతా" అంటూ ఆడియన్స్ ని అడిగాడు. అలా ఈ వారం షో ఆడియన్స్ ని అలరించింది. తక్కువ సమయంలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు విశ్వక్ . 2017 లో వెళ్ళిపోమాకే అనే మూవీతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఈ సినిమాతో ఉత్తమ తొలి నటుడిగా అవార్డు అందుకున్నాడు. తర్వాత 2018లో ఈ నగరానికి ఏమైంది అనే మూవీలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కూడా ఉత్తమ నటుడి అవార్డును సొంతం. ఇక ఫలక్ నుమాదాస్ సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో కూడా నటించాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..