English | Telugu

టాయిలెట్ పేపర్ మీద ప్రేమ కవిత్వం చెప్పిన  ప్రిన్స్

ఆహా ఓటిటి ప్లాటుఫారంపై డగ్ అవుట్ అనే షో నవదీప్ హోస్ట్ గా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షో సీజన్ 1 కాస్త గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం షోకి తేజస్విని మడివాడ, నటుడు ప్రిన్స్ వచ్చారు. హోస్ట్ నవదీప్ వాళ్ళతో మంచి గేమ్ ఆడించాడు. ఐతే ఇందులో ఒక టాస్క్ లో భాగంగా "టాయిలెట్ పేపర్ కి లవ్ లెటర్ రాయాలి" అని రావడంతో ప్రిన్స్ దాని మీద లవ్ కవిత చెప్పాడు.

"ఓ టాయిలెట్ పేపరు..ఓ టాయిలెట్ పేపరు..ఎంత సన్నగా ఉన్నావో, ఎంత తెల్లగా ఉన్నావో, అవసరం వచ్చినప్పుడల్లా నేను నిన్ను ఎన్ని విధాలుగా వాడుకున్నానో యూఎస్ లో..ఒక్కోసారి నిన్ను చూసి ఎంత చిరాగ్గా ఫీలయ్యానో నాకే తెలుసు...టాయిలెట్ పేపరు...టాయిలెట్ పేపరు... నిన్ను మడతపెట్టి జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను అవసరం వచ్చినప్పుడు నిన్ను వాడుకుంటాను ..ఐ లవ్ యు టాయిలెట్ పేపర్" అని ప్రిన్స్ కవిత చెప్పాక అదే టాయిలెట్ పేపర్ మీద తేజు కవిత చెప్పింది "డియర్ టాయిలెట్ పేపర్..నిన్ను దానికి తప్ప ఇంకా చాలా వాటికి వాడాను, లిప్ స్టిక్ తుడుచుకోవడానికి , మేకప్ తీసేయడానికి, ఎవరూ లేనప్పుడు జంగల్ లో ఒక్కదాన్నే తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావ్..సో ఎప్పటికీ నేను కూడా నీతో ఉంటా..ఇట్లు తేజస్విని" అని ఫన్నీగా లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇక ఎపిసోడ్ ఎండింగ్ వరకు అన్ని రకాల టాస్కుల్లో తేజు, ప్రిన్స్ పోటీ పడ్డారు.. లాస్ట్ లో తేజు కప్పు గెలిచింది. తేజు ఇటీవలి కాలంలో "అర్దమయ్యిందా అరుణ్ కుమార్" మూవీలో నటించింది. అలాగే ప్రిన్స్ బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా చేసాడు అలాగే త్రి రోజెస్, ది అమెరికన్ డ్రీం, డిజె టిల్లు మూవీస్ లో నటించాడు. హోస్ట్ నవదీప్ న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.