English | Telugu
స్టేజి మీద నుంచి లేచి వెళ్లిపోయిన ఉషా ఉత్థుప్.. శ్రీరామ్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Updated : Jun 4, 2022
తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ఇప్పుడిప్పుడే ఒక మంచి పేరు అనేది వస్తోంది. ఐతే ఈ షోలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఈ షోలోంచి జడ్జ్ గా విచ్చేసిన ఉషా ఉత్థుప్ కోపంతో ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. దీనికి కారణం హోస్ట్ శ్రీ రామచంద్ర. పార్టిసిపెంట్స్ అంతా ఒక్కసారిగా ఏమయ్యిందో అర్ధం కాక షాక్ అయ్యారు. ప్రేక్షకులు కూడా అసలు షోలో అంత లెజెండరీ సింగర్ ని పట్టుకుని అంత చీప్ గా ఎలా మాట్లాడతారు అంటూ తిట్టుకున్నారు. ఆమె వయసుకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటూ తమన్ మీద, శ్రీరామ్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.
అసలింతకీ ఏమయ్యిందంటే.. షో మధ్యలో శ్రీరామ్ "ఉషా ఉత్థుప్ గారు ..మీ వాయిస్ గంభీరం .. మీ పాట అమృతం .. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్లు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్ళు.. మీ నుదిటిన పెద్ద బొట్టు .. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు " అంటూ ఆమె మీద ఒక కవితను సంధించారు.
'నా మీద నేను జోక్స్ వేసుకుని నవ్వుకుంటాను. కానీ నువ్ ఈరోజు నన్ను గంభీరం అంటూ సంబోధించావ్. ఇలా అనడం నాకు నచ్చలేదు. ఈ షో కోసం నేను కోల్కతా నుంచి వచ్చాను. ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు' అంటూ శ్రీరామచంద్ర మీద ఫైర్ అయ్యి సీట్ లోంచి లేచి వెళ్లిపోయారు. స్టేజి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. శ్రీరామ్ కి కూడా అసలేం జరుగుతుందో అర్ధం కాక ఉషా ఉత్థుప్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఐనా ఆమె క్షమించకపోయేసరికి అదే పనిగా సారీ చెప్తూనే ఉన్నాడు. 'మధురం అని కాకుండా గంభీరం అంటూ ఒక మగవాడిగా నన్ను అభివర్ణించావ్' అంటూ మండిపడ్డారు.
ఏదైమైనా జోక్స్ అంటే నాకు ఇష్టం కానీ ఇది టూ మచ్ అంటూ కోప్పడ్డారు. "మీకు నా క్షమాపణలు. నేను కావాలని ఇలా చెప్పలేదు మీ ఆశీర్వాదాలు కావాలి అమ్మ " అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీరామ్. చివరికి అందరూ నచ్చచెప్పాక ఆమె కొంచెం శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఉష కూడా నవ్వేసి 'నేను అలాంటి దాన్నా కాదా, అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా మీద నేనే జోక్స్ వేసుకుంటాను, నవ్వుకుంటాను. ఇదంతా లైట్' అనేసరికి శ్రీరామ్ కి ప్రాణం లేచొచ్చినట్టైంది.
ఆ వెంటనే తమన్ స్టేజిని కూల్ చేయడానికి " ఉషా ఉత్థుప్ కాదు ఉషా షట్ అప్ " అని అనేసరికి అందరూ నవ్వేస్తారు. మామ్ ఇంత గ్రేట్ ప్రాంక్ చేసి నా దిమ్మ తిరిగేలా చేశారు అంటూ శ్రీరామ్ అనేసరికి ఉషా గారు నవ్వేశారు. ప్రాంకా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే 'ఇలా ఒక స్టేజి షో చేసేటప్పుడు అక్కడ ఉండే లెజండరీస్‌గురించి తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఏదేదో మాట్లాడేసి వాళ్ళను అవమానించడం కరెక్ట్ కాదు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం తమన్, శ్రీరామ్ మీద ఫైర్ అవుతున్నారు.