English | Telugu

ఛీ.. తూ... నాగార్జున ఫైర్.. శోభా శెట్టికి కౌంట్ డౌన్ మొదలైందా!?


బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో అదరగొడుతుంది.‌ ఇక శనివారం వచ్చిందంటే చాలు ఆడియన్స్ ప్రోమో కోసం వేయికళ్ళతో‌ఎదురుచూస్తారు. ఎందుకంటే వారమంతా హౌస్ లో ఉన్నవాళ్ళు ఎవరేం చేశారో? ఎవరెలా ఉన్నారో‌ నాగార్జున చెప్తూ క్లాస్ పీకుతాడు. ఇదంతా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది.

గత వారం నుండి శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రోమో రానే వచ్చింది. ఇందులో హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకి రావడమే సుత్తితో వచ్చాడు. నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో అదే ప్రాసెస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరు హిట్టా? ఫట్టా అని చెప్పాడు. ఇక రాగానే శోభాశెట్టి మాట్లాడింది వీడియో వేసి చూపించాడు. శనివారం నాటి ఎపిసోడ్ లో A-z మాట్లాడకపోతే నేను శోభాశెట్టినే కాదన్నావ్ కదా మాట్లాడు అని నాగార్జున అనగానే.. ప్రతీసారీ శివాజీ సర్ ఫేవరిజం, ఫేవరిజం అని అంటున్నారు. లాస్ట్ వీక్ వచ్చాం కదా.. ఎక్కడ ఏ మిస్టేక్ చేశానో చెప్పండి నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని అడుగుదామని అనుకు‌న్నాని శోభా అంది. ఒకే సంఛాలక్ గా నువ్వు చేసిందేంటని శోభాని అడుగగా.. ప్రియాంకని ఎంకరేజ్ చేశాను సర్ అని అంది. సంఛాలక్ అంటే ఒక రెఫరీ.‌ అతను ఎవరికి పక్షపాతం చూపించకూడదు. నువ్వేం చేశావని అడుగగా.. బిగ్ బాస్ అది ఫన్ టాస్క్ అని చెప్పాడని అనగా.. అది ఫన్ కాదు సీరియస్ లేకపోతే సంఛాలక్ ని ఎందుకు పెడతారు. నువ్వు ప్రియాంకకి సీరియస్ గా సపోర్ట్ చేశావని అనగా.. ఎస్ నాకు ప్రియాంక ఇష్టం. అందుకే సపోర్ట్ చేశానని శోభా అంది.

ఇలా ఓపెన్ గా చెప్తే వాళ్లు అలాగే అంటారు కదా అని శోభాకి నాగార్జున పంచ్ విసిరాడు. టు బి ఫ్రాంక్ ఈ వీక్ అమథా డిస్టబ్ అయ్యాను సర్. అందుకే అలా చేశానని శోభా అనగా.. నువ్వు డిస్టబ్ అయ్యి అందరిని డిస్టబ్ చేశావ్. అందరి ఆటని డిస్టబ్ చేశావని నాగార్జున అన్నాడు. గట్టిగా కొట్టానన్నావ్ అని అనగా.. లేదు సర్.. నేను ఎక్కడ అనలేదని అంది శోభా. ఇక వీడియో ఫుటేజ్ చూపించాడు నాగార్జున. ఆ తర్వాతర్వాత యావర్ బిహేవియర్ చూపిస్తూ వీడియోని ప్లే చేసి చూపించాడు. ఛీ.‌ తూ అని నువ్వు అనడం కరెక్టేనా? యూ ఆర్ రాంగ్ అని యావర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..