English | Telugu

Shivaji : ధర్మంగా ఉన్న శివాజీపై నాగార్జున అనవసర ఆరోపణ!

బిగ్ బాస్ సీజన్-7 లో నిన్నటి ఎపిసోడ్ తో జనాలందరికి ఒక్కటే అర్థం అయింది. శివాజీ తప్పు చేయకుంటే, తన పాయింట్ మీద తను స్ట్రాంగ్ ఉంటాడని తెలిసింది. అవతల వాదించేది హౌస్ మేట్ అయిన, హోస్ట్ అయిన శివాజీ ఆర్గుమెంట్స్ బలంగా ఉంటాయని మరోసారీ ఋజువైంది. శివాజీ ధర్మంగా ఉంటాడని, నాగార్జున అనవసరమైన ఆరోపణ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు నాగార్జున.

"నీ లాంటి వాళ్లు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అని అన్నావ్. ఏంటది శివాజీ" అని నాగార్జున అడుగగా.. నేను ఏదో వాంటెడ్‌గా మాట్లాడిన మాట కాదు సర్ అది నాకు వేసిన బాధ అని శివాజీ చెప్పాడు. ఆ బాధలో మీ ఇంట్లో ఆడపిల్లలను అయితే పీకుతావా అని అంటావా అని అడిగాడు. అవునండి కొడతానండి అని శివాజీ అనగానే నాగార్జున మరింత ఫైర్ అయ్యాడు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. కోపంలో ఇలా అనేస్తావా అని నాగార్జున అనగా.. నేను మనిషినే బాబు గారు‌. గత రెండు వారాలుగా ప్రశాంత్ పై వాళ్ళు చూపించే ప్రవర్తన ‌సరిగ్గ లేదండి. పాపం సర్ వాడు. హౌస్ లో ఎంత కష్టపడిన వాడిని అసలు మనిషిలా కూడా చూడట్లేదేండి.‌ ఇక ఉండబట్టలేక అలా‌ అన్నాను సర్. అది కూడా వాళ్ళని అనలేదండి. మా ఇంట్లో ఆడవాళ్ళని అన్నానని‌ శివాజీ అనగానే.. ఆడియన్స్ మాట్లాడతారంటా అని నాగార్జున అన్నాడు. మీరు‌ అలా ఆడపిల్లని కాలుతో తొక్కుతా అని అనడం కరెక్ట్ కాదేమో అని శివాజీని ఒక ఆడియన్ ప్రశ్నించగా.. అదేంటమ్మ మరి మగాళ్ళని అనొచ్చా అని క్రాస్ క్వశ్చన్ వేసాడు‌ శివాజీ.‌ ఇక తను తడబడుతుండగా నాగార్జున మధ్యలో కలుగజేసుకొని ఏంటి శివాజీ డైవర్ట్ చేస్తున్నావా? మగాళ్ళని అనొచ్చా అని ఎందుకు డైవర్ట్ చేస్తున్నావని అన్నాడు. నేను మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అలా చేస్తానని కోపంలో‌‌ అన్నాను సర్. వాంటెడ్ గా అనలేదని‌ శివాజీ అన్నాడు.

కొన్ని కోట్ల మంది జనాలు‌ ఈ షోని చూస్తున్నారు. ఆడవాళ్ళని అలా అనొచ్చా? వారికి సారీ చెప్పు.. లేదా శోభాశెట్టి, ప్రియాంకలకి సారీ చెప్పు అని శివాజీని నాగార్జున అనగానే.. బాబు గారు నేను అందరిని ఉద్దేశించి అనలేదండి. ఒకవేళ నా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే తొక్కుతా అని అన్నానండి. అయిన కోపంలో అన్నవి నిజంగా చేస్తామా బాబు గారు అని తన పాయింట్ మీద స్ట్రాంగ్ గా ఉన్నాడు శివాజీ. ‌నీ స్థానంలో నేను ఉంటే సారీ చెప్తానని నాగార్జున అనగా.. నేను ఎవరిని కావాలని అనలేదండి. నా ఇంట్లో‌ ఆడవాళ్ళని మాత్రమే అన్నానండి ఎవరిని ఉద్దేశించి అనలేదని శివాజీ అన్నాడు. సరే నీ ఇష్టం. హాల్ లోకి వచ్చేయ్ అని నాగార్జున అన్నాడు. ఇక ఆ తర్వాత శోభాశెట్టి, ప్రియాంకలని పిలిచి శివాజీ తన తెలియకుండా మిమ్మల్ని అన్నాను సారీ అని చెప్పాడు. శివాజీతో నాగార్జున డిస్కషన్ చూసిన ప్రతీ ఒక్క ఆడియన్ కి ఒక్కటే అర్థం అయింది. శివాజీ తప్పు చేయడు. అతను తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటాడని తెలిసింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో జన్యున్, ఫెయిర్ ప్లేయర్ శివాజీనే అని ప్రపంచానికి తెలిసింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..