English | Telugu

కార్తీక దీపం: ఊహించ‌ని షాకిచ్చిన మోనిత‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ కార్తీక దీపం. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతున్న కార్తీక దీపం ఈ గురువారం మ‌రో మ‌లుపు తీసుకుంది. ఈ గురువారం 1230వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కే షాకిచ్చిన సౌంద‌ర్య‌కు మోనిత ఎలాంటి ఝ‌ల‌క్ ఇచ్చింది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు ఎపిసోడ్ వివ‌రాలేంటో ఒక‌సారి లుక్కేద్దాం.

Also read:'కృతి శెట్టి'కి ఏం తెలీదు.. నేను, సాయి పల్లవి అప్పుడే అనుకున్నాం!

దీప‌, కార్తీక్‌లు ఎక్క‌డున్నాకో చెప్ప‌మ‌ని వార‌ణాసిని సౌంద‌ర్య ప్రాధేయ‌ప‌డుతుంటుంది. అది చూసిన మోనిత కోడ‌లి కోసం ఎంత ఏడుస్తున్నారు కానీ నా బాబు ఏం చేశాడు ఆంటీ? వాడు మీ మ‌న‌వ‌డే క‌దా? వాడి కోసం మీరు ఇలా తాప‌త్ర‌య‌ప‌డ్డారా? అంటుంది మోనిత‌. దీంతో సౌంద‌ర్య అన‌వ‌స‌రంగా మాట్లాడ‌కు అంటూసీరియ‌స్ అవుతుంది. "ఆ రోజు మీరు త‌ల్లిని బిడ్డ‌ని వేరు చేసి హిమ‌ని ఎత్తుకొచ్చారు. వాళ్ల‌ని క‌ల‌ప‌డానికి అలా చేసిన మీరు ఈ రోజు న‌న్ను - కార్తీక్ ని విడ‌దీయ‌డానికి నా బిడ్డ‌ని ఎత్తుకురాలేద‌ని ఎలా అనుకోమంటారు?" అని నిల‌దీస్తుంది మోనిత‌.

దీంతో సీరియ‌స్ అయిన సౌంద‌ర్య "నోర్ముయ్ మోనిత.. నీ బాబు క‌నిపించక‌పోతే వెళ్లి వెతుక్కో ..ఇలాగే వాగావ‌నుకో నీకు కాల్చిన అట్ల కాడ‌తో ఆటోగ్రాఫ్ ఇస్తా" అంటుంది. క‌ట్ చేస్తే ... పిల్ల‌ల‌తో క‌లిసి మొక్క‌లు నాటుతుంటాడు డాక్ల‌ర్ బాబు. ఆ త‌రువాత `బంగారం అమ్మేశావా? నేను చేత‌గాని వాడిలా అయిపోయాను. న‌న్ను ఏ ప‌ని చేయెద్దు అంటావ్ నువ్వేమో ఇలాంటి పనులు చేస్తుంటావ్' అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు డాక్ట‌ర్ బాబు.. ఇదిలా వుంటే శ్రావ్య ఏడుస్తూ "దీపు దీపుగాడు క‌నిపించ‌ట్లేదు అత్త‌య్య" అని అరుస్తూ సౌంద‌ర్య ద‌గ్గ‌రికి వ‌స్తుంది.

ఇదంతా సైలెంట్ గా మోనిత గ‌మ‌నిస్తూ వుంటుంది. దీపుని మోనితే దాచి వుంటుంద‌ని శ్రావ్య చెబుతుంది. దీంతో అనుమానం వ‌చ్చిన సౌంద‌ర్య మోనిత‌ని నిల‌దీసి పీక ప‌ట్టుకుని చంపేస్తానంటుంది. నిజంగానే మోనిత దీపుని దాచేసిందా? .. ఇంత‌కీ విష‌యం తెలిసి సౌంద‌ర్య ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.