'కృతి శెట్టి'కి ఏం తెలీదు.. నేను, సాయి పల్లవి అప్పుడే అనుకున్నాం!
on Dec 22, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని మీడియాతో మచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృతి శెట్టి కొత్త అమ్మాయి అని, తనకి ఇండస్ట్రీ గురించి పెద్దగా ఏం తెలీదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృతి శెట్టి కొత్తగా వచ్చిందని, తనకి ఇది రెండో సినిమానే కాబట్టి.. ఇండస్ట్రీ ఏంటి? ఇక్కడ ఎలా ఉంటుంది? అనేది పెద్దగా తెలియదని నాని చెప్పారు. అయితే తనకి నేర్చుకోవాలన్న తపన ఉందని, ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటుందని.. అది తనలో ఉన్న గుడ్ క్వాలిటీ అని నాని అన్నారు.
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' కథ ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ డీటైల్స్!
'MCA' సినిమా సమయంలోనే ఇకముందు ఇలాంటి క్యారెక్టర్స్ చేయొద్దని తాను, సాయి పల్లవి అనుకున్నామని నాని తెలిపారు. ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ లో కొత్తదనం ఉండదని.. తాము బయట ఎలా ఉంటామో ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయని అన్నారు. అయితే తమ మధ్య ఉన్న సన్నివేశాలు తక్కువే అయినప్పటికీ, తమ పెయిర్ కి మంచి పేరు వచ్చిందని నాని చెప్పుకొచ్చారు. ఆ సినిమా సమయంలోనే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో మా ప్రపంచాలను దాటిపోయి, ఆసక్తికరమైన పాత్రలు వస్తేనే కలిసి నటించాలని అనుకున్నామని తెలిపారు. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్'లో అలాంటి పాత్రలే చేశామని, ఇది మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని నాని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



