English | Telugu

ర‌ష్మీ కార‌వాన్ లో క‌మెడియ‌న్.. ఏమా క‌థ‌!

బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్ హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కామెడీ షోల‌కు బుల్లితెర‌పై వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కామెడీ షోల్లో యాంక‌ర్ ర‌ష్మీ.. జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నో, రోజాలు వేసే పంచ్‌లు మామూలుగా పేల‌వు. అందుకే ఈ షో అంటే య‌మ క్రేజ్. ఆ క్రేజ్ కి తగ్గ‌ట్టే ప్ర‌తీ ఎపిసోడ్ ని కొత్త‌గా మ‌లుస్తున్నారు నిర్వాహ‌కులు.

ఇక షోల‌ని మించి ప్రోమోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోని వ‌దిలారు. అది నెట్టింట ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తోంది. ఈ ప్రోమోలో రోహిణి, హైమా, రాకింగ్ రాకేష్‌, వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్ అద‌ర‌గొట్టేశారు. రోహిణి .. రాకింగ్ రాకేష్ ని ఆడుకున్న వైనం న‌వ్వులు పూయిస్తోంది. ఈ సంద‌ర్భంగా రాకింగ్ రాకేష్ పై మ‌నో వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలి ప్రోమోని వైర‌ల్ అయ్యేలా చేసింది.

Also read:నేను పడిన కష్టాలు 'వాసు' పడలేదు!

ఈ ప్రోమో స్టార్టింగ్ లో రాకింగ్ రాకేష్..ర‌ష్మీతో క‌లిసి డ్యాన్సులు చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఎండింగ్ లో ర‌ష్మీ కాళ్ల‌కి మొక్కుతున్న‌ట్టుగా వంగ‌డం.. ఇదే అద‌నుగా భావించిన ర‌ష్మీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్టుగా పోజు పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. అయితే దీనిపైమ‌నో వేసిన పంచ్ మామూలుగా పేల‌లేదు. పొద్దున కార‌వాన్‌లో కాళ్ల మీద ప‌డ్డావ్‌.. డ్యాన్స్‌కా? అని సింగ‌ర్ రాకింగ్ రాకేష్ గాలి తీసేశాడు.. రాకింగ్ రాకేష్ నిజంగానే ర‌ష్మీ కార‌వాన్ లోకి వెళ్లాడా? .. ఏమాక‌థ‌? అని నెటిజ‌న్ లు తెగ కామెంట్ లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.