English | Telugu

ట్రెండిగ్‌లో బిగ్‌బాస్‌ భోలే షావలి అమ్మ పాట!

అమ్మ గురించి కవులు, పండితులు, విశ్లేషకులు ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరించారు. అయితే సిరివెన్నెల సాహిత్యంలో అమ్మకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అంటూ అమ్మ లాలన గురించి సిరివెన్నెల గొప్పగా రాశాడు. ఇప్పుడు అదే కోవలోకి బిగ్‌బాస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి చేరాడు. మొన్న శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లోని గార్డెన్‌ ఏరియాలో కూర్చొని అమ్మ మీద ఒక పాట పాడాడు. ఇప్పుడు ఆ పాట సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లో ఉంది.

‘‘అమ్మ నాన్న విలువ తెలుసుకో వారి, నువ్వు పైనుండి ఊడిపడ్డావా జారి’’ అంటూ తనే సొంతంగా లిరిక్స్‌ అనుకొని లైవ్‌లో పాడాడు భోలే షావలి. కాగా ఈ పాటలోని లిరిక్స్‌కి నాగార్జునతో పాటు బిగ్‌ బాస్‌ వీక్షించే ప్రేక్షకులు ఫిధా అయ్యారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఎక్కడ చూసినా భోలే షావలి అమ్మ పాటే వినిపిస్తుంది. ట్విట్టర్‌లో ట్రెండిరగ్‌లో ఉంది. కాగా ఈ ట్రెండిరగ్‌ ట్వీట్స్‌లో భోలే షావలి పాడిన పాట కూడా ఉండంట విశేషం. బిగ్‌ బాస్‌కి వెళ్ళేకంటే ముందు చాలా పాటలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో అతను పాడిన పాటలు ఎంతో ఫేమస్‌.

కిక్‌2 సినిమాలోని ‘కంఫర్ట్‌’ పాట పాడిరది భోలే షావలి అని ఎంతమందికి తెలుసు. ఇక ఈ మధ్య మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ‘పాలు అమ్మిన’ పాట భోలే షావలీయే పాడిరది. వీటితో పాటు పలు సినిమాల్లో కూడా పాడిన భోలే షావలి.. తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌కి మ్యూజిక్‌ ఇచ్చాడు. అవన్నీ యూట్యూబ్‌లో ఎప్పుడూ ట్రెండిరగ్‌లో ఉండే పాటలే. కాగా అతడికి అభిమానులు చాలానే ఉన్నారు. అయితే ప్రియాంక, శోభా శెట్టి కలిసి నామినేషన్‌లో అతనిపై మాటల యుద్ధం జరిపిన సంగతి తెలిసిందే. ఒక తోటి కంటెస్టెంట్‌ అని కూడా చూడకుండా ‘థూ’ అంటూ భోలేని ప్రియాంక అంది. కానీ హౌస్‌ మొత్తానికి ఇప్పుడు పాటలతో, మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్నాడు భోలే షావలి. ఇలా సందర్భానుసారంగా అప్పటికప్పుడు లిరిక్స్‌ అనుకొని పాట పాడుతూ మ్యూజిక్‌ ఇస్తూ.. రోజు రోజుకి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాడు భోలే షావలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.