English | Telugu
ఈ టీవీనటి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ ఇంత విలక్షణమా!
Updated : Feb 16, 2021
బుల్లితెర నటులు సినిమా స్టార్‌లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆ రేంజ్‌లో హంగామా చేస్తున్నారు. ఓ సీరియల్ హిట్టయితే స్టార్స్‌కి మించిన పాపులారిటీ బుల్లితెర తారలకు సొంతమవుతోంది. దీంతో వారు ఏది చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదిలా వుంటే బుల్లితెర నటి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
జీ తెలుగులో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ 'నిన్నే పెళ్లాడతా'. ఈ ధారావాహికలో హీరోయిన్‌గా నటించిన మధుబాల మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదే సీరియల్‌కి రైటర్‌గా వ్యవహరిస్తున్న ప్రజా ప్రభాకర్‌తో గత కొంత కాలంగా ప్రేమలో వుంది. ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమ పెళ్లికి సై అనడంతో ఈ నెల 17న వీరి ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది.
మైసూర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఇదిలా వుంటే వీరి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రజా ప్రభాకర్ స్వతహాగా రైటర్ కావడంతో తన స్టైల్‌ని నిశ్చితార్ధ ఆహ్వానలేఖలోనూ వాడాడు. అచ్చమైన తెలంగాణ యాసలో తీర్చి దిద్దిన ఈ ఆహ్వానలేఖని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ప్రజా ప్రభాకర్. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.