English | Telugu
సర్‌ప్రైజ్ చేసిన రామ్.. కన్నీరు పెట్టుకున్న సునీత!
Updated : Feb 16, 2021
అవును. ఇది స్టార్ మా చానల్‌లో ప్రారంభం కానున్న '100% లవ్ షో'లో చోటు చేసుకుంది. ఈ చానల్ ఇటీవల ప్రారంభించిన బిగ్ బాస్ ఉత్సవం, కామెడీ స్టార్స్ షోలకు మంచి టీఆర్పీ లభిస్తోంది. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని డబుల్ చేయడంలో భాగంగా '100% లవ్'` పేరుతో మరో వినూత్నమైన షోని ప్రారంభించబోతోంది. 6 రియల్ కపుల్స్, 6 రీల్ కపుల్స్ ఈ షోలో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఈ నెల 21 సాయంత్రం 6 గంటలకి ఈ షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. '100% లవ్' మూవీ తీసిన లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ ప్రారంభ షోలో సందడి చేయబోతున్నారు.
అలాగే న్యూ కపుల్ సింగర్ సునీత, రామ్ వీరపనేని కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో స్టార్ మా అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో సందడి చేస్తోంది. మొదట ఒంటరిగా ఈ షోకి వచ్చిన సునీత మైక్ పట్టుకొని మాట్లాడుతూ, "రామ్ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ" అని చెప్పగానే, వెనుక నుంచి వచ్చి ఆమె వీపు తట్టారు రామ్. షాక్‌తో "ఆ.." అని వెనక్కి తిరిగి చూసి, రామ్ కనిపించేసరికి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు సునీత. ఆ తర్వాత రామ్‌ను హత్తుకున్నారు.
డైరెక్టర్ సుకుమార్ బెత్తం పట్టుకుని వచ్చి మాట్లాడుతూ, "ఒకళ్లు ప్రేమిస్తారు, ఇంకొకళ్లు స్పందిస్తారు" అనగానే, ఎమోషనల్ అయిన సునీత కళ్లల్లోంచి నీటి బొట్లు ఆమె చెంపల మీదుగా జారాయి. ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో 21వ తేదీ మనం చూడబోతున్నాం. యాంకర్ రవి, వర్షిణి సౌందరరాజన్ ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.