English | Telugu

మా పాపతో మాములుగా ఉండదు!

డైరెక్టర్ కుమార్ పంతం.. బ్రహ్మముడి సీరియల్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతకముందు గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం. కుమార్ పంతం భార్య కిరణ్మయి కూడా పాపులర్ అయింది.

కిరణ్మయి.. బుల్లితెర సీరియల్ నటి. ఈవిడ అందరికి సుపరిచితమే. తనకి ఇద్దరు చెల్లెల్లు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్క కిరణ్మయి బాటలోనే నడుస్తూ సీరియల్స్ లో నటిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో 'జ్వాల' కి తల్లిపాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ లో హీరోకి తల్లిపాత్రలో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తను 'మీ కిరణ్మయి' అని సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 'ఫైనల్లీ నేనొచ్చేసా' అనే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేసి వెల్ కమ్ చెప్పింది కిరణ్మయి.

తన మొదటి వ్లాగ్ లో కుమార్ పంతంని ఇంటర్వూ చేసినట్టుగా స్టార్ట్ చేసిన కిరణ్మయి. మా శ్రీవారి చేతి చికెన్ బిర్యానీ వ్లాగ్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత 15mins లో సింపుల్ మేకప్, మా వరలక్ష్మి కోసం షాపింగ్, మా ఇంటికి నేనే మహారాణి, నా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతితో గుప్పెడంత మా మనసు అనృ వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా విశేష స్పందన లభించింది. కాగా ఇప్పుడు తాజాగా ' మా పాపతో మాములుగా ఉండదు' అనే మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది కిరణ్మయి. ఇందులో కిరణ్మయి తన కూతురితో కలిసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలంటు ఒక గేమ్ ఆడారు. ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర, బాదం మిక్స్, ఐస్ మిక్స్ చేసి తాగాలని, తప్పు సమాధానం చెప్తే ఆరెంజ్ జ్యూస్ లో కారం, మసాలా, పసుపు, టమాట సాస్ వేసుకొని తాగాలనే షరతు పెట్టుకొని గేమ్ ఆడారు. అయితే ఇందులో ఎక్కువ తప్పు సమాధానాలు కిరణ్మయి చెప్పింది. అందుకే కిరణ్మయి మా పాపతో మాములుగా ఉండదు అని అంది. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.