English | Telugu

వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం బంగారం కొన్నాం!

లాస్య మంజునాథ్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న లాస్య ఈ మధ్యే తనకి కొడుకు పుట్టాడని చెప్పింది. ఆ తర్వాత వ్లాగ్ లు చేస్తుంది. పిల్లలు ఉన్న మదర్స్ కి టిప్స్ చెప్తూ పలు వ్లాగ్ లు చేయగా అవి యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఇలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ లాస్య మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది.

పలు టీవి కార్యక్రమాలకు యాంకర్ గా చేసిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చి విశేషంగా ఆకట్టుకుంది. పోస్డ్ డెలివరీ అంటూ తనకి బాబు పుట్టాక, తను ఎలా ఉంటుందో, పేరు పెట్టేప్పుడు ఒక వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్, తనకి బాబు పుట్టాక తన దినచర్య ఏంటో ఒక వ్లాగ్ గా అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటూ వస్తోంది లాస్య.


లాస్యకి రెండోసారి కొడుకు పుట్టాక.. తెగ వ్లాగ్స్ చేస్తుంది. మా చిన్నోడి ఫస్ట్ ఫోటో షూట్, న్యూ బార్న్ తో ఫస్ట్ ఫ్లైట్ అంటూ వ్లాగ్స్ చేస్తూనే.. వంటల్లో మెలుకువలు చెప్తుంది లాస్య. బర్త్ డే షాపింగ్, కోడిగుడ్డు వెల్లుల్లి కారం, మేకింగ్ మెమోరీస్ ఫర్ లైఫ్ టైమ్, మటన్ కీమా రెసిపీ అంటూ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది లాస్య. తాజాగా తను ' వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం బంగారం కొన్నాం' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తన భర్త మంజునాథ్ మరియు బాబుతో కలిసి ఒక షాపింగ్ మాల్ కి వచ్చింది లాస్య. అందులో సెలబ్రిటీల కోస‌ం ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయని చెప్పడంతో తను అమ్మవారి కోసం బంగారం తీసుకుందామని వచ్చిందని ఈ వీడియోలో చెప్పింది లాస్య. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫుల్ రష్ ఉన్నట్టుగా చెప్పిన లాస్య.. తన యూట్యూబ్ సబ్ స్జ్రైబర్స్ కి థాంక్స్ చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.