English | Telugu
భవాని నిర్ణయం సరైనదేనా.. మురారి అలా చెప్పడంతో ముకుంద షాక్!
Updated : Aug 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -241 లో.. తన ప్రేమ విషయం భవానికి చెప్పేస్తుంది ముకుంద. అయితే ఆ ప్రేమ ఇంక కంటిన్యూ అవట్లేదు, మర్చిపోయానని భవాని కాళ్లు పట్టుకొని చెప్తుంది. కానీ భవానికి ముకుంద వల్లే నా కొడుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడని తనపై కోపంగా ఉంటుంది. ఆ తర్వాత రేవతిని పిలిచి.. ఇక్కడ నుండి ముకుందని తీసుకొని వెళ్ళని చెప్పగానే.. ముకుందని రేవతి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత భవాని దగ్గరికి రేవతి వచ్చి.. అసలు ఏమైంది అక్క అని అడుగుతుంది. కల్నల్ ఫోన్ చేసిన విషయం గురించి భవాని చెప్తుంది. మరొకవైపు మురారి జ్ఞాపకాలతో కృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.. తన ఫ్రెండ్ భోజనం చెయ్ అంటూ భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత మురారి వచ్చి తనని ఆటపట్టిస్తు భోజనం తినిపిస్తునట్లు ఉహించుకుంటుంది కృష్ణ. మరొక వైపు రేవతి, మురారిలతో భవాని మాట్లాడుతుంది. ముకుంద పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందంట.. ఆవిషయం తెలిసే ఆదర్శ్ ఇంటికి రాలేదని మురారికి భవాని చెప్తుంది. ప్రస్తుతం ఆ ప్రేమని మర్చిపోయానని చెప్తుంది కానీ అది అబద్ధమనిపిస్తుంది. ఇన్ని రోజులు ముకుంద బాధపడేది ఆదర్శ్ కోసం కాదు తను ప్రేమించిన వాడి కోసమని భవాని చెప్తుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముకుంద ఎవరిని ప్రేమించిందో తెలుసుకొని ఆదర్శతో విడాకులు ఇప్పించి అతనితో పెళ్లి చేస్తే ముకుంద హ్యాపీగా ఉంటుంది. ఆదర్శ్ కూడా ఇంటికి వస్తాడని అనగానే రేవతి, మురారి ఇద్దరు టెన్షన్ పడతారు.
ఆ తర్వాత ముకుంద ఎవరిని ప్రేమించిందో నువ్వే కనుక్కోవాలని మురారికి భవాని చెప్తుంది. లేదు పెద్దమ్మ నేను క్యాంప్ కి వెళ్తున్నానని మురారి చెప్తాడు. సరే ఆ విషయం నేను కనుక్కుంటానని భవాని అంటుంది. ఇన్ని రోజులు మీకు ఈ విషయం తెలియకుండా చేసింది ఇలా చేస్తారనే అని రేవతి మనసులో అనుకొని బాధపడుతుంది. మరొకవైపు మురారితో ముకుంద మాట్లాడుతుంది. సంవత్సరం నుండి ఇద్దరం మన జీవితాలను త్యాగం చేసామంటూ.. వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతుంది ఆదర్శ్ ఆచూకి తెలిసిందని మురారి చెప్పగానే ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.