English | Telugu

మోనితని టెన్ష‌న్ పెడుతున్న తుల‌సి!

డైలీ సీరియల్ `కార్తీక్ దీపం` క్లైమాక్స్‌కి వ‌చ్చేసిందా? అనే లోపు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు, ట్విస్టుల‌తో షాకిస్తోంది. విహారి కార‌ణంగా డాక్ట‌ర్ బాబు, దీప‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెర‌గ‌డం.. దీప‌ని త‌న ఇంటి నుంచి డాక్ట‌ర్ బాబు వెలివేయ‌డం.. ఇద్ద‌రు పిల్ల‌లో పెద్ద పాప శౌర్య‌తో వంట‌ల‌క్క‌గా జీవితాన్ని దీప సాగించ‌డం.. మ‌రో పాప హిమ‌ని సౌంద‌ర్య త‌న త‌న‌యుడు డాక్ట‌ర్ బాబు చెంత‌కు చేర్చ‌డం తెలిసిందే.

అయితే ఈ మొత్తం క‌థ గాడి త‌ప్ప‌డానికి.. దీప - డాక్ట‌ర్ బాబు విడిపోవ‌డానికి కార‌ణంగా విహారి. అయితే అత‌న్ని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడిన మోనిత త‌న ప్లాన్‌తో దీప - డాక్ట‌ర్ బాబుని శాశ్వ‌తంగా విడ‌గొట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తోంది. ఇదిలా వుంటే విహారి భార్య తుల‌సికి విహారి సంసార జీవితానికి ప‌నికిరాడ‌న్న నిజం తెలుస్తుంది. ఆ నిజం చెప్పేసి దీప - డాక్ట‌ర్ బాబుల మ‌ధ్య అపార్థాల్ని తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగా దీప‌ని క‌లిసి విష‌యం చెప్పాల‌ని ఇంటికి వెళుతుంది. కానీ ఇంట్లో దీపి లేక‌పోవ‌డం, అక్క‌డే దీప తండ్రి వుండ‌టంతో అస‌లు విష‌యం చెప్ప‌క దీప‌ని త‌ను క‌ల‌వ మ‌న్నాన‌ని చెప్పి వెళ్లిపోతుంది.

ఇంత‌లో తుల‌సి గురించి మోనిత టెన్ష‌న్ ప‌డుతూ వుంటుంది. విహారి వ‌ల్ల తుల‌సికి ప‌ల్లలు పుట్టే అవ‌కాశం లేద‌ని కార్తీక్‌కి తెలిస్తే ఇంకేమైనా వుందా?.. కార్తీక్ అనుమానంతో ఎంక్వైరీ మొద‌లుపెడితే .. డొంకంతా క‌దులుతుంది. దీని వెన‌కుంది నేనేన‌ని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ నేను ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా న‌మ్మ‌డు. ఇప్పుడు ఏం చెయ్యాలి. దీప తుల‌సిని క‌లిసినా డేంజ‌రే.. విష‌యం తెలిస్తే దీప ఊరుకోదు.. సౌంద‌ర్య‌కు చెప్పేస్తుంది. ఆ త‌రువాత కార్తీక్‌కి తెలుస్తుంది. అంతా ఒక్క‌టైపోతారు నో.. అలా జ‌ర‌గ‌డానికి వీళ్లేదు` అని శుక్ర‌వారం ఎపిసోడ్‌లో మోనిత కంగారు ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? కార్తీక్‌కి అస‌లు విష‌యం తెలిసిందా.. రేప‌టి ఎపిసోడ్‌కి సాగ‌దీశారా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.