English | Telugu
చిన్నతనంలో హేమ రౌడీనా?
Updated : Feb 19, 2021
క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో `మా` ఎలక్షన్‌లలో మెంబర్‌గా గెలిచి ప్రమాణ స్వీకారం రోజు తనని మాట్లాడనివ్వని `మా` అధ్యక్షుడు నరేష్‌నే మీడియా సాక్షిగా కడిగిపారేసి వార్తల్లో నిలిచారు. ప్రమాణ స్వీకారానికి ముందే మమ్మల్ని మాట్లాడనివ్వకుండా మైక్ లాగేసుకుంటున్నారంటూ బాహాటంగానే నరేష్‌ని నిలదీసినంత పని చేశారు. ఇదిలా వుంటే ఆమెని నటుడు ఆలీ "చిన్నతనంలో రౌడీ అంటగా!" అంటూ సంబోధించడం ఆసక్తికరంగా మారింది.
ఈ టీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న`ఆలీతో సరదాగా` కార్యక్రమంలో హేమ, నటి శ్రీలక్ష్మిఅతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా హేమ, శ్రీలక్ష్మీ పలు ఆసక్తికర విషయాల్ని ఆలీతో పంచుకున్నారు. ఈ క్రమంలో"చిన్నతనంలో హేమ పెద్ద రౌడీ అంట కదా?" అని ప్రశ్నించారు. దీనికి హేమ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
"అలా ఏమీ కాదు కానీ ఇంట్లో అందరికంటే నేను చిన్నదాన్ని.. అక్కలతో కలిసి జాతరలకు, అంర్వేది తీర్థాలకు వెళుతుండేదాన్ని. అక్కడికి ఎంతో మంది జనం వచ్చేవారు. ఎవరైనా మాతో వెకిలి వేషాలు వేస్తే అక్కడే కొట్టేసేదాన్ని. అలా ఒకబ్బాయిని కొడితే తల బొప్పికట్టింది. అప్పట్లో నా చేతికి ఇనుపగాజులు వుండేవి. నేను ప్రతీసారి గాజులు పగలగొట్టుకుంటున్నానని అమ్మే ఇనపగాజులు వేసేది"అని హేమ చిన్ననాటి సంగతుల్ని పంచుకున్నారు.
hema shares her personal life, hema in Alitho Saradaga,Alitho Saradaga,Sri Lakshmi,Hema