English | Telugu

Bigg Boss Season 7 Telugu: గౌతమ్ కృష్ణపై ట్రోల్స్.. శివాజీని టార్గెట్ చేయడమే కారణమా!


బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తుంది. కంటెస్టెంట్స్ చేసే స్ట్రాటజీలకి బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లు కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

నిన్నటి వరకు సాగిన బాల్ గేమ్ లో లయన్స్ టీమ్ అయినటువంటి గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, టేస్టీ తేజ, యావర్, అంబటి అర్జున్ గెలిచారు. ఇక హౌస్ లోని బ్లాక్ బాల్ ఎవరికి వచ్చిందని బిగ్ బాస్ అడుగగా.. గౌతమ్ టీమ్ కి వచ్చిందన్నారు. దాంతో గౌతమ్ టీమ్ కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్సీ రేస్ లో పాల్గొనలాంటే అపోజిట్ టీమ్ నుండి ఒకరి తరుపున మరొకరు ఆట ఆడాల్సి ఉంటుంది. ఎవరికైతే ఏ కంటెస్టెంట్ ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించాడో అతను ఈ గేమ్ నుండి అవుట్ అనగానే.. యావర్ తప్పుకున్నాడు. ఇక అంబటి అర్జున్ తరుపున శివాజీ , శోభాశెట్టి తరుపున అమర్ దీప్ , గౌతమ్ కృష్ణ తరుపున అశ్వినిశ్రీ గేమ్ ఆడారు. అయితే ఈ గేమ్ లో శోభాశెట్టి తరుపున ఆడిన అమర్ దీప్ గెలిచాడు‌. దాంతో శోభాశెట్టి కెప్టెన్ అయింది.

గేమ్ మధ్యలో అశ్వినిశ్రీ వెళ్ళి గౌతమ్ కృష్ణతో గ్రూప్ గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ తనతో చెప్పి శివాజీ మీద నెగెటివిటిని పెంచాలని చూస్తుంది.‌ ఇక అశ్వినిశ్రీ చెప్పింది పట్టుకున్న అశ్వగంధ గౌతమ్.. శివాజీ దగ్గరికి వెళ్ళి వాదనకి దిగాడు. అదే విషయాన్ని బిగ్‌బాస్ లోని కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పుకొని.. "నన్ను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ " అంటూ వేడుకున్నాడు. బిగ్ బాస్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..