English | Telugu
బిగ్‌బాస్ ఓటీటీ లిస్ట్ ఫైనల్ అవుతోందా?
Updated : Dec 31, 2021
తెలుగులో బుల్లితెరపై ప్రసారం అయ్యే రియాలిటీ షో బిగ్‌బాస్ కి వున్న క్రేజే వేరు. ఇందులోకి వెళ్లి బయటికి వచ్చిన చాలా మంది పాపులర్ అయ్యారు. కెరీర్ పరంగా ఓ మెట్టు ఎక్కేశారు. ప్రస్తుంత వరుస అవకాశాలతో బిజీగా వున్నారు. దీంతో బిగ్‌బాస్ కు తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో పాల్గొనాలని చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు నెలల్లో సీజన్ 6 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటీటీ సీజన్ అంటూ కొత్తగా చర్చ మొదలైంది.
బుల్లితెర తో పాటు ఓటీటీ ఫార్మాట్ లోనూ బిగ్‌బాస్ వీక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన వార్తని నాగార్జున ఇటీవల స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఓటీటీ సీజన్ కు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తారని, ఇది 24 అవర్స్ ఫార్మాట్ లో వుంటుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీరే అంటూ రోజుకో పేరు తెరపైకి వచ్చేస్తోంది.
కొత్తగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత సీజన్ కోసం వీరు పోటీపడ్డారు. కానీ అవకాశం దక్కలేదు. అలా అవకాశం దక్కని వీరికి ఓటీటీ బిగ్‌బాస్ లో చోటు దక్కినట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా వీరితో పాటు టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష ల పేర్లు కూడా ఫైనల్ లిస్ట్ లో వున్నట్టుగా చెబుతున్నారు. అయితే వీళ్లలో యాంకర్ శివ, వర్షిణి సౌందరరాజన్, వైష్ణవి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.