English | Telugu
తిలోత్తమను దిష్టిబొమ్మను చేసన నయని!
Updated : Jul 30, 2022
అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ ట్విస్ట్‌లు, ఆసక్తికర మలుపులతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పవిత్రా లోకేష్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, విష్ణు ప్రియ, ద్వారకేష్ నాయుడు, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8:30 ప్రసారం అవుతోంది.
భూషణ్ బ్రతికే వున్నాడని తెలుసుకున్న తిలోత్తమ ఆలోచనలో పడుతుంది. ఇదే సమయంలో అతని భార్య ఫోన్ చేసి ఎందుకు బెదిరించిందో కనుక్కుంటే అసలు విషయం బయటపడుతుందని వల్లభ అంటాడు. కరెక్ట్ టైమ్ లో గుర్తు చేశావని తనకు భూషణ్ భార్య గా ఫోన్ చేసిన నంబర్ కు తిలోత్తమ ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే ఆ ఫోన్ ఇంట్లోని హాల్ లో రింగ్ అవుతుండటం గమనించిన వల్లభ, తిలోత్తమ ఒక్కసారిగా షాక్ అవుతారు. అది గమనించిన హాసిని ఫోన్ మర్చిపోయానని కంగారు పడుతూ వుంటుంది. ఇదే సమయంలో ఆ ఫోన్ దగ్గరికి నయని రావడంతో తిలోత్తమ షాక్ అవుతుంది.
అంతా తనే చేసిందని కొత్త కుట్రకు తెర తీస్తుంది. జ్వరం అనే నెపంతో నయని శ్రీమంతాన్ని అడ్డుకునే ప్లాన్ వేస్తుంది. అయితే తిలోత్తమ ఎత్తుకు పై ఎత్తు వేసిన నయని తన తిక్క కుదర్చడానికి స్వామిజీని పిలిపిస్తుంది. బ్రమలతో భయపడి బాధపడుతున్న మా అత్తయ్య గారికి సోకిన గాలి వదిలిపోయేలా చూడండి అని చెబుతుంది. దాంతో స్వామీజీ మీ అత్తగారి మెడలో ఈ దిష్టితాడు కట్టమని పశువుల మెడలో కట్టే తాడుని ఇస్తాడు స్వామీజీ.. అది చూసిన తిలోత్తమ ఎద్దుకు కట్టినట్టు ఆ తాడు నాకు కట్టడమేంటీ? అంటేంది. దీంతో విశాల్ వారిస్తాడు. కట్టుకోమంటాడు. వెంటనే నయని తిలోత్తమ మెడలో దిష్టితాడు కడుతూ ఓవరాక్షన్ చేసిన నిన్ను దిష్టిబొమ్మను చేశానంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. తిలోత్తమ ఎలా రియాక్ట్ అయిందన్నది తెలియాలంటే మండే వరకు వేచి చూడాల్సిందే.