English | Telugu

ప్రియురాలితో భర్త సరసాలు.. అది చూసి ముక్కలైన భార్య మనసు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -329 లో.. రాజ్ ఆఫీస్ కి బయల్దేరి వెళ్తూ ఫైల్ గురించి వాళ్ళ బాబాయ్ ని, డాడ్ ని అడుగుతాడు. అప్పుడే రెడీ అయి కావ్య కూడా కిందకి వస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని తీసుకొని అనామిక వస్తుంది. కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్ళడానికి సూట్ వేసుకుంటాడు. అందరు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ బాగున్నావని అంటారు. ఇన్ని రోజులకైనా ఆఫీస్ కి వస్తున్నావ్ సంతోషం అని రాజ్ అంటాడు. నా కొడుకు రావద్దా? నువ్వు నీ భార్య వెళ్తే సరిపోతుందా అని ధాన్యలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత మా ఆయన ఉదేశ్యం అది కాదు.. ఎప్పుడు కవితలపై ఇంట్రస్ట్ ఉంటుంది కదా ఆఫీస్ పై ఇంట్రెస్ట్ ఉండదు కదా.. ఈ విషయం అందరికి తెలుసు కదా అందుకే ఆయన అలా అంటున్నాడని కావ్య అంటుంది.. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు. మీ కార్ లో వస్తాను వదిన అని కళ్యాణ్ అనగానే.. నేను మీ అన్నయ్యని ఫాలో అవుతు వెళ్తున్నానని కావ్య అంటుంది. దానికి సరే అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత మన కార్ లో వెళ్ళు అని ధాన్యలక్ష్మి కార్ కీస్ ఇస్తుంది. పులిని చుసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందని అపర్ణ అనగానే.. ఎవరిని అంటున్నావ్ అక్క అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నక్కని అంటున్నా.. నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటున్నావని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కావ్య తనని ఫాలో అవుతుందని రాజ్ చూస్తాడు. ఇక శ్వేత దగ్గరకి వెళ్లి కావ్య తననే చూస్తుందని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. శ్వేతని కావాలనే ఎత్తుకుంటాడు. నీకు విడాకులు వస్తున్నాయా.. ఇక నేను కూడా విడాకులు తీసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందామని రాజ్ అనగానే కావ్య మనసు ముక్కలు అవుతుంది. ఏడుస్తూ వెళ్లిపోతుంది. నువ్వు ఇలా చేయడం తప్పు.. నా భర్త ఎంత శాడిస్ట్ అయినా విడాకులు తీసుకుంటుంటే బాధేస్తుంది. నువ్వు కావ్య విషయం లో తప్పు చేస్తున్నావని శ్వేత అంటుంది.

ఆ తర్వాత అనామిక, రుద్రాణి కలిసి కావ్యని ఇరికించాలని చెప్పి లాకర్ లో ఉన్న డబ్బులు రుద్రాణి తీసుకొని వస్తుంది. ఇక కీస్ దొరికాయని నేను వెళ్లి పెద్ద అత్తయ్యకి ఇస్తానని అనామిక అంటుంది. ఆ తర్వాత రాజ్ ఇంకా ఆఫీస్ కి రాలేదని సుభాష్, ప్రకాష్ కోపంగా ఉంటారు. అప్పుడే కావ్య వస్తుంది. ఒకసారి రాజ్ కి కాల్ చెయ్ మీటింగ్ కి టైమ్ అవుతుందని సుభాష్ అనగానే.. కావ్య చేస్తుంది. కానీ కావ్య ఫోన్ కావాలనే రాజ్ లిఫ్ట్ చెయ్యడు. తరువాయి భాగంలో.. నా నుండి దూరంగా ఉంటేనే కావ్యకి నచ్చినట్టు ఉంటుంది. తను నన్ను వదిలి వెళ్ళాలని మన స్నేహన్ని అడ్డుగా పెట్టుకొని ఇలా చేస్తున్నానని శ్వేతతో రాజ్ అంటాడు. ఆ మాటలు కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.